Skip to main content

APGLIC : ఏపీజీఎల్‌ఐసీ సమస్యలపై ఎస్టీయూ డిమాండ్..

State Teachers Union demand on solving APGLI problems

అనంతపురం: ఉద్యోగ, ఉపాధ్యాయులకు సంబంధించిన ఏపీజీఎల్‌ఐసీ సమస్యలు తక్షణమే పరిష్కరించాలని రాష్ట్రోపాధ్యాయ సంఘం (ఎస్టీయూ) నాయకులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు మంగళవారం ఏపీజీఎల్‌ఐసీ డిప్యూటీ డైరెక్టర్‌ భాస్కర్‌ తేజనాథ్‌ను కలసి వినతిపత్రం అందజేశారు.

Nirmal Degree College: నిర్మల్‌ డిగ్రీ కళాశాల అరుదైన ఘనత

ఈ సందర్భంగా ఎస్టీయూ జిల్లా అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు రమణారెడ్డి, రామాంజనేయులు మాట్లాడుతూ.. జీఎల్‌ఐసీ ఫైనల్‌ పేమెంట్లు, లోన్లు, మిస్సింగ్స్‌ క్రెడిట్స్‌, డెత్‌ క్లెయిమ్స్‌తో పాటు ఇది వరకే దరఖాస్తు చేసిన అన్ని బాండ్ల క్లెయిమ్స్‌ను వెంటనే క్లియర్‌ చేయాలని కోరారు. డీడీని కలిసిన వారిలో ఎస్టీయూ రాష్ట్ర అదనపు కార్యదర్శి సూర్యుడు, నాయకులు కృష్ణ మోహన్‌, ఫణి భూషణ్‌, రాజశేఖర్‌, నాగభూషణ, రాజన్న ఉన్నారు.

High Court: ఖాళీలు భర్తీ చేయండి.. కోఠి ఆసుపత్రిపై సర్కార్‌కు హైకోర్టు ఆదేశం

Published date : 24 Jul 2024 03:01PM

Photo Stories