High Court: ఖాళీలు భర్తీ చేయండి.. కోఠి ఆసుపత్రిపై సర్కార్‌కు హైకోర్టు ఆదేశం
తదుపరి విచారణను ఆగస్టు 27కు వాయిదా వేసింది. కోఠి ప్రసూతి వైద్యశాలలో వసతులు లేవని, గర్భిణులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వారికి కనీస సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని పేర్కొంటూ ఓ పత్రికలో వచ్చిన కథనాన్ని 2016లో హైకోర్టు విచారణకు స్వీకరించింది. దీనిపై సీజే ధర్మాసనం జూలై 23న మరోసారి విచారణ చేపట్టింది.
చదవండి: Change Name in Certificates: సర్టిఫికెట్లపై పేరు మార్చి ఇస్తే నష్టమేంటి ?: హైకోర్టు
అమికస్ క్యూరీ కిరణ్మయి హాజరై ప్రభుత్వం జూలై 12న దాఖలు చేసిన నివేదిక ప్రకారం అన్నీ సక్రమంగానే ఉన్నాయని, అయితే లాబీలో రోగులు, వారితో వచ్చిన వారు కూర్చోవడానికి ఏర్పాట్లు చేయాలని కోర్టు దృష్టికి తెచ్చారు. ప్రభుత్వం తరఫున జీపీ పీ.శ్రీధర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. పీడియాట్రిక్ సివిల్ సర్జన్ పోస్టు భర్తీ చేయాల్సి ఉందని, అత్యవసరంగా నియామకం చేపడతామని చెప్పారు.
లాబీలో కూర్చునేందుకు ఏర్పాట్లు కూడా చేస్తామన్నారు. ‘లంచం ఇవ్వకూడదని సాధారణ ప్రజలకూ తెలియజేసే డిస్‌ప్లే బోర్డులు పెట్టాం. అలా ఎవరన్నా అడిగితే చర్యలు తీసుకుంటామని కూడా చెప్పాం. ఒకవేళ ఎవరైనా లంచం అడిగితే ఎవరిని సంప్రదించాలో తెలుగు, ఇంగ్లిష్‌లో వివరాలు, ఫోన్ నంబర్లను పేర్కొన్నాం’ అని జీపీ చెప్పారు.