Skip to main content

Group-C jobs Notification released: భారీగా గ్రూప్‌ C ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల

Group C jobs Notification
Group C jobs Notification

ఇండియన్ ఆర్మీ కార్ప్స్ (AOC) నుండి వివిధ రకాల గ్రూప్-C ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత అభ్యర్థులు నుండి దరఖాస్తులు కోరుతూ 20-11-2024వ తేదిన నోటిఫికేషన్ విడుదల చేసారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 723 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

10వ తరగతి, Inter పరీక్షల షెడ్యూల్‌ విడుదల: Click Here

భర్తీ చేయబోయే పోస్టులు  :

ఇండియన్ ఆర్మీ కార్ప్స్ (AOC) నుండి విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా గ్రూప్-C ఉద్యోగాలు అయిన ట్రేడ్స్ మేట్, ఫైర్ మెన్, జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ మరియు మెటీరియల్ అసిస్టెంట్ అనే ఉద్యోగాలకు భర్తీ చేస్తున్నారు.

మొత్తం ఖాళీల సంఖ్య : 

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 723 పోస్టులు భర్తీ చేస్తున్నారు. పోస్టులు వారీగా ఖాళీల వివరాలు ఇలా ఉన్నాయి.
ట్రేడ్స్ మెన్ మేట్  – 389
ఫైర్ మెన్ – 247
మెటీరియల్ అసిస్టెంట్ – 19
జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ – 27
సివిల్ మోటార్ డ్రైవర్ – 07
టెలి ఆపరేటర్ గ్రేడ్ 2 – 14
కార్పెంటర్ మరియు జాయినర్ – 07
పెయింటర్ మరియ డెకరేటర్ – 05
మల్టీ టాస్కింగ్ స్టాఫ్ – 11

విద్యార్హత : పదో తరగతి , డిగ్రీ, సంబంధిత విభాగంలో డిప్లమో వంటి విద్యార్హతలు ఉన్నవారు ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకోవచ్చు.

వయస్సు :

ఫైర్ మాన్ మరియు ట్రేడ్స్ మెన్ మేట్ ఉద్యోగాలకు 18 నుండి 25 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి.
మెటీరియల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు 18 నుండి 27 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి.

వయసులో సడలింపు : 

ప్రభుత్వ నిబంధనలో ప్రకారం వయసులో సడలింపు వర్తిస్తుంది. అనగా
ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయసులో సడలింపు ఉంటుంది. 
ఓబీసీ అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయసులో సడలింపు ఉంటుంది. 

దరఖాస్తు విధానం : అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు ఆన్లైన్ లో ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకోవాలి.

ఎంపిక విధానం :

ఫిజికల్ ఎఫిషియన్సీ మరియు ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ 
రాత పరీక్ష 
డాక్యుమెంట్ వెరిఫికేషన్ 
మెడికల్ ఎగ్జామినేషన్

జీతము : పోస్టులను అనుసరించి అభ్యర్థులు ఎంపిక అయ్యే ఉద్యోగాన్ని బట్టి లెవెల్-1 నుండి లెవెల్-2 వరకు పే స్కేల్ ఉంటుంది.

అప్లికేషన్ చివరి తేదీ : నోటిఫికేషన్ విడుదలైన తేదీ నుండి 21 రోజుల్లోపు అప్లై చేయడానికి అవకాశం ఇస్తారు.

Official WebsiteClick here

Published date : 23 Nov 2024 07:45PM
PDF

Photo Stories