Education Development : పేద విద్యార్థుల విద్యాభివృద్ధికి నెదర్యాండ్ బృందం చేయూత..
బల్లికురవ: గ్రామీణ ప్రాంతాల్లోని పేద విద్యార్థుల విద్యాభివృద్ధికి చేయూత ఇస్తామని నెదర్‌ల్యాండ్ బృదం సభ్యులు నీల్స్, టిన్నెట్, జాన్ వెల్లడించారు. ఎంవీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బల్లికురవ ప్రభుత్వ జూనియర్ కళాశాలకు రూ.4.5 లక్షలతో పది కంప్యూటర్లు అందజేశారు. బృంద సభ్యులు శుక్రవారం కంప్యూటర్ ల్యాబ్‌ను పరిశీలించి సంతృప్తి చెందారు. నెదర్‌ల్యాండ్ ప్రతినిధులు మాట్లాడుతూ నేటి సమాజంలో కంప్యూటర్ ఆవశ్యకత పెరిగిందని, విద్యతోపాటు కంప్యూటర్ పరిజ్ఞానాన్ని ప్రతి ఒక్కరూ పెంచుకోవాలన్నారు.
బాలబాలికలు జీవితంలో స్థిర పడేవరకు వివాహాలు చేసుకోవద్దని, బాల్య వివాహాల వల్ల జరిగే అనర్థాలను వారు వివరించారు. అనంతరం కళాశాలలోని మొదటి, రెండో సంవత్సరం విద్యార్థులతో ముచ్చటించి వారి సమస్యలు తెలుసుకున్నారు. కళాశాల క్రీడా మైదానంలో నీడనిచ్చే పలు రకాల మొక్కలు నాటారు. విద్యార్థులతో జరిగిన సమావేశంలో దూర ప్రాంతాల నుంచి ఇక్కడ కళాశాలకు వచ్చి చదువుకుంటున్నామని విద్యార్థులు చెప్పారు.
Anti-Air Missiles: ఉత్తర కొరియా చేతికి రష్యన్ గగనతల రక్షణ క్షిపణులు
బస్సు సౌకర్యాలు సక్రమంగా లేనందున ఇబ్బందులు పడుతున్నామని, రాకపోకలకు సైకిళ్లు అందజేసి తోడ్పాటునివ్వాలని పలువురు విద్యార్థులు సభ్యుల దృష్టికి తెచ్చారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ ఎం అనిల్ కుమార్, అధ్యాపకులు ఎంవీ పౌండేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)