Wipro Company New Rules: ఆఫీస్‌కు రాకుంటే.. ఉద్యోగులకు విప్రో కొత్త కండీషన్!
ఉద్యోగులను ఆఫీస్‌లకు రప్పించడానికి దేశీయ ఐటీ దిగ్గజం విప్రో కొత్త కండీషన్ పెట్టింది. వర్క్ ఫ్రమ్ ఆఫీస్‌కు సంబంధించి నూతన విధానాన్ని అమలు చేస్తోంది. ఇందులో భాగంగా ఆఫీస్‌లో హాజరుకు ఉద్యోగుల లీవ్‌లకు లింక్ పెట్టింది. దీని ప్రకారం.. ఉద్యోగులు వారంలో కనీసం మూడు రోజులు ఆఫీస్‌లకు వచ్చి పనిచేయాలి. లేకుంటే లీవ్స్ వదులుకోవాల్సిందే..
Work From Home: వర్క్ ఫ్రమ్ హోమ్‌కి ముగింపు పలికిన అమెజాన్.. ఆఫీస్ నుంచే పని చేయాలని ఆదేశం
కొత్త వర్క్ ఫ్రమ్ ఆఫీస్ పాలసీ గురించి తెలియజేస్తూ సెప్టెంబర్ 2వ తేదీనే ఉద్యోగులకు ఈ-మెయిల్స్ పంపింది. ఈ పాలసీకి కట్టుబడి ఉండాలని ఆదేశించింది. మరోవైపు ఎవరికైనా వర్క్ ఫ్రమ్ హమ్ రిక్వెస్ట్‌లకు అనుమతి ఇచ్చి ఉంటే తక్షణమే వాటన్నింటినీ రద్దు చేసి వారానికి కనీసం మూడు రోజులు ఆఫీస్‌కి వచ్చేలా సూచించాలని హెచ్‌ఆర్ విభాగానికి కూడా ఆదేశాలు జారీ చేసినట్లు ‘మింట్’ కథనం పేర్కొంది.
Job Mela: గుడ్‌న్యూస్.. రేపు మెగా జాబ్‌మేళా, పూర్తి వివరాలు ఇవే
విప్రో అమలు చేస్తున్న కొత్త వర్క్ ఫ్రమ్ ఆఫీస్ పాలసీ ప్రకారం.. వారంలో మూడు రోజులు ఆఫీస్ హాజరు తప్పనిసరి. ఒక వేళ ఆఫీస్‌కి హాజరుకాకపోతే దాన్ని సెలవుగా పరిగణిస్తారు. అంటే వారంలో మూడు రోజులు ఆఫీస్‌కు రాకపోతే ఆ రోజులను సెలవుగా పరిగణించి ఆ మేరకు లీవ్స్ కట్ చేస్తారని ఓ ఉద్యోగిని ఉటంకిస్తూ మింట్ వివరించింది. అయితే ఈ నిర్భంధ హాజరు విధానం ప్రత్యేకంగా కొన్ని ప్రాజెక్టుల్లో ఉద్యోగులకు మాత్రమేనని, అందరికీ ఇది వర్తించదని చెబుతున్నారు.