1-crore Salary package: కోటి రూపాయల ప్యాకేజీతో అదరగొట్టిన ఐఐఐటీ అమ్మాయి... కోడింగ్‌పై పట్టుంటే కోట్లు కొళ్లగొడుతున్న విద్యార్థులు

ఇండియాలో అత్యధిక శాలరీ ప్యాకేజీలు సంపాదించిన వారెవరా అని చూస్తే అందులో 99 శాతం మంది ఐఐటీ, ఎన్ఐటీ, ఐఐఎంలలో చదివినవారే ఉంటారు. ఐఐటీ, ఐఐఎం, ఐబీఎం లాంటి దిగ్గజ విద్యాసంస్థలకు తామేమీ తీసిపోమని నిరూపిస్తున్నారు ఐఐఐటీ విద్యార్థులు.
చదవండి: ఇది కదా సక్సెస్ అంటే... రోజుకు 1.6 లక్షలు.. ఏడాదికి 6 కోట్ల ప్యాకేజీతో అదరగొట్టిన కుర్రాడు
అలహాబాద్ లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐఐటీ)కి చెందిన బీటెక్ విద్యార్థి పాలక్ మిట్టల్ అమెజాన్ నుంచి కోటి రూపాయలకు పైగా వేతన ప్యాకేజీ సాధించింది. పాలక్ మిట్టల్ తన లింక్డ్ఇన్ ప్రొఫైల్ ప్రకారం ఆమె.. 2022 ఆగస్టులో టెక్ దిగ్గజం అమెజాన్‌లో జాయిన్ అయ్యింది. బెర్లిన్‌లోని అమెజాన్ కార్యాలయంలో అమెజాన్ వెబ్ సర్వీసెస్ (ఎడబ్ల్యూఎస్) విభాగంలో సాఫ్ట్‌వేర్ డెవలపర్‌గా తన కెరియర్‌ను ప్రారంభించింది.

➤☛ మూడు కోట్ల ప్యాకేజీతో గోల్డెన్ చాన్స్ కొట్టిన బీటెక్ విద్యార్థి
ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, కోడింగ్‌పై పట్టుసాధించడంతోనే తనకు ఈ ప్యాకేజీ వచ్చినట్లు మిట్టల్ చెబుతోంది. కోడింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో పూర్తి అవగాహన ఉండడం ఆమెకు మరొక ప్లస్ పాయింట్. అలాగే ఏడబ్ల్యూఎస్ లాంబ్డా (AWS Lambda), ఏడబ్ల్యూఎస్ ఎస్3(AWS S3), ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ వాచ్(AWS Cloudwatch), టైప్ స్క్రిప్ట్(Typescript), జావా(Java), ఎస్‌క్యూఎల్(SQL) వంటి క్లౌడ్ ఫ్లాట్‌ఫాంపై పూర్తి పట్టుసాధించింది. ఇవన్నీ ఆమెకు అత్యధిక వేతనం లభించడానికి కారణమయ్యాయి.

➤☛ రెండు కోట్ల ప్యాకేజీతో అదరగొట్టిన హైదరాబాదీ అమ్మాయి
రూ. కోటి అంతకు మించిన ప్యాకేజీ సాధించిన వారిలో మిట్టల్ మాత్రమే కాదు... ఐఐఐటీ అలహాబాద్ లోని ఆమె సహచరులు ఉన్నారు. అనురాగ్ మకాడే గూగుల్ నుంచి రూ.1.25 కోట్ల భారీ ప్యాకేజీని పొందగా, అఖిల్ సింగ్ రూబ్రిక్ తో రూ.1.2 కోట్ల ప్యాకేజీ సాధించాడు.