Skip to main content

Job Mela: 23వ తేదీ జాబ్‌ మేళా.. అర్హులు వీరే..

పార్వతీపురం టౌన్‌: పార్వతీపురంలోని శ్రీ వేంకటేశ్వర ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ నెల 23వ తేదీ జాబ్‌ మేళా నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ చలపతిరావు తెలిపారు.
Job Fair Announcement   Job Mela in Parvathipuram Town on May 23  Sri Venkateswara Government Degree College

ఈ మేరకు మే 19వ తేదీ ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. 

ఈ జాబ్‌ మేళాలో పాల్గొనే ఐసీఐసీఐ బ్యాంక్‌, హెచ్‌డీబీ ఫైనాన్షియల్‌ సర్వీస్‌, డెక్కన్‌ కెమికల్స్‌, ఫాక్స్‌కాన్‌, ఆల్‌స్టామ్‌, డైకీ అల్యూమినియమ్‌ ఇండస్ట్రీ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీలలో రిలేషన్‌షిప్‌ మేనేజర్‌, బిజినెస్‌ ఎగ్జిక్యూటివ్‌, టెక్నీషియన్‌ ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 

ఎస్‌ఎస్‌సీ, ఇంటర్మీడియట్‌, ఐటీఐ, డిప్లమో, ఏదైనా డిగ్రీ, బీటెక్‌ ఉత్తీర్ణులై 35 సంవత్సరాలలోపు వయస్సు కలిగిన అభ్యర్థులు జాబ్‌మేళాకు అర్హులని, ఆసక్తి గల అభ్యర్థులు ఆ రోజు ఉదయం 9 గంటలకు సర్టిఫికెట్ల జిరాక్స్‌లతో హాజరుకావాలని కోరారు. మరిన్ని వివరాలకు ఫోన్‌ 9440127517 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.

SBI Jobs Notification 2024 : గుడ్‌న్యూస్‌.. SBIలో 15000 ఉద్యోగాలు.. పూర్తి వివ‌రాలు ఇవే..!

Published date : 20 May 2024 05:41PM

Photo Stories