CLAT 2025 Notification : క్లాట్–2025 నోటిఫికేషన్ విడుదల.. 24 నేషనల్ లా యూనివర్సిటీల్లో ప్రవేశాలు!
వీటిలో బ్యాచిలర్, పీజీ స్థాయిలో..‘లా’ కోర్సులను పూర్తి చేసుకుంటే.. న్యాయవాద వృత్తిలో రాణించే నైపుణ్యాలతోపాటు కార్పొరేట్ కెరీర్స్ సైతం స్వాగతం పలుకుతాయి. ఇలాంటి నేషనల్ లా యూనివర్సిటీల్లో న్యాయవిద్య కోర్సుల్లో ప్రవేశానికి మార్గం.. క్లాట్! 2025 విద్యాసంవత్సరానికి సంబంధించి క్లాట్ నోటిఫికేషన్ వెలువడింది. ఈ నేపథ్యంలో..
క్లాట్–2025 అర్హతలు, పరీక్ష విధానం, సిలబస్ అంశాలు, ప్రిపరేషన్ తదితర వివరాలు..
న్యాయ విద్య కోర్సులు ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎంలపై యువతలో ఆసక్తి పెరుగుతోంది. దీనికి కారణం.. సంప్రదాయ న్యాయవాద వృత్తితోపాటు కార్పొరేట్ రంగంలోనూ కొలువులు లభిస్తుండడమే. క్లాట్ స్కోర్ ఆధారంగా ప్రతిష్టాత్మక నేషనల్ లా యూనివర్సిటీల్లో అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్ బీఏ–ఎల్‌ఎల్‌బీ, అదే విధంగా పీజీ స్థాయిలో ఎల్‌ఎల్‌ఎం కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఇందుకోసం ప్రతిఏటా కన్సార్షియం ఆఫ్ నేషనల్ లా యూనివర్సిటీస్ ఆధ్వర్యంలో క్లాట్‌ను నిర్వహిస్తారు.
Faculty Posts at AIIMS : ఎయిమ్స్‌లో ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు..
క్లాట్ యూజీ, పీజీ
బ్యాచిలర్ స్థాయిలో బీఏ–ఎల్‌ఎల్‌బీ, పీజీ స్థాయిలో ఎల్‌ఎల్‌ఎం కోర్సుల్లో ప్రవేశాలు కల్పించేందుకు క్లాట్–యూజీ, క్లాట్–పీజీ నిర్వహిస్తారు. బీఏ–ఎల్‌ఎల్‌బీ ప్రవేశం కోసం క్లాట్–యూజీ, ఎల్‌ఎల్‌ఎంలో అడ్మిషన్ కోసం క్లాట్–పీజీలో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది.
అర్హతలు
➤ క్లాట్–యూజీ: కనీసం 45 శాతం మార్కులతో ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణత ఉండాలి. రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులు కనీసం 40 శాతం మార్కులు సాధించాలి. అర్హత కోర్సు చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
➤ క్లాట్–పీజీ: కనీసం 50 శాతం మార్కులతో ఎల్‌ఎల్‌బీ ఉత్తీర్ణత సాధించాలి. రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు అయిదు శాతం సడలింపు లభిస్తుంది. ఆయా కోర్సులు చివరి సంవత్సరం అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
Current Affairs: జూలై 25వ తేదీ.. టాప్ కరెంట్ అఫైర్స్ ఇవే!
120 మార్కులకు పరీక్ష
➤ క్లాట్–యూజీ పరీక్షను అయిదు విభాగాల్లో నిర్వహిస్తారు. ఇంగ్లిష్ లాంగ్వేజ్ 22–26 ప్రశ్నలు, కరెంట్ అఫైర్స్, జీకే 28–32 ప్రశ్నలు, లీగల్ రీజనింగ్ 28–32 ప్రశ్నలు, లాజికల్ రీజనింగ్ 22–26 ప్రశ్నలు, క్వాంటిటేటివ్ టెక్నిక్స్ 10–14 ప్రశ్నలు ఉంటాయి. ఇలా మొత్తంగా అన్ని విభాగాలు కలిపి 120 ప్రశ్నలు అడుగుతారు. పరీక్షకు కేటాయించిన మార్కులు 120. పరీక్ష పూర్తిగా ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. పరీక్ష సమయం రెండు గంటలు.
➤ ఇంగ్లిష్ లాంగ్వేజ్, కరెంట్ అఫైర్స్, లీగల్ రీజనింగ్, లాజికల్ రీజనింగ్‌లలో పూర్తిగా ప్యాసేజ్ ఆధారిత ప్రశ్నలే అడుగుతారు. క్వాంటిటేటివ్ టెక్నిక్స్ విభాగంలోనూ గ్రాఫ్స్, టేబుల్స్, డయాగ్రమ్స్ ఆధారిత ప్రశ్నలు ఉంటాయి.
➤ మొత్తం ప్రశ్నల్లో.. ఇంగ్లిష్ లాంగ్వేజ్, లాజికల్ రీజనింగ్‌ల నుంచి 20 శాతం చొప్పున; కరెంట్ అఫైర్స్ అండ్ జీకే, లాజికల్ రీజనింగ్‌ల నుంచి 25 శాతం చొప్పున; క్వాంటిటేటివ్ టెక్నిక్స్‌ను నుంచి 10 శాతం చొప్పున ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది.
క్లాట్–పీజీ ఇలా
➤ బీఏ–ఎల్‌ఎల్‌బీ, లేదా ఎల్‌ఎల్‌బీ అర్హతగా నేషనల్ లా యూనివర్సిటీల్లోని ఎల్‌ఎల్‌ఎం స్పెషలైజేషన్లలోని సీట్ల భర్తీకి క్లాట్–పీజీ పరీక్షను 120 ప్రశ్నలు–120 మార్కులకు నిర్వహిస్తారు. ప్యాసేజ్ ఆధారితంగా ఆబ్జెక్టివ్ తరహాలో ప్రశ్నలు అడుగుతారు.
➤ పరీక్షలో కాన్‌స్టిట్యూషనల్ లా సంబంధిత ప్రశ్నలు, జ్యూరిస్పుడెన్స్, అడ్మినిస్ట్రేటివ్ లా, లా ఆఫ్ కాంట్రాక్ట్, టార్ట్స్, ఫ్యామిలీ లా, క్రిమినల్ లా, ప్రాపర్టీ లా, కంపెనీ లా, పబ్లిక్ ఇంటర్నేషనల్ లా, ట్యాక్స్ లా, ఎన్విరాన్‌మెంటల్ లా, లేబర్ అండ్ ఇండస్ట్రియల్ లా విభాగాల నుంచి ప్రశ్నలు అడుగుతారు.
Breaking news Schools closed: స్కూల్స్ బంద్.. ఎన్ని రోజులంటే
ముఖ్య సమాచారం
➤ దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
➤ ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: 15.07.2024
➤ ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 15.10.2024
➤ క్లాట్ పరీక్ష తేదీ: 2024, డిసెంబర్ 1
➤ వెబ్‌సైట్: https://consortiumofnlus.ac.in/clat-2025
రాత పరీక్షలో రాణించేలా
క్లాట్ ఎంట్రన్స్‌లలో విజయం సాధించాలంటే.. విద్యార్థులు నిర్దిష్ట వ్యూహంతో అడుగులు వేయాలి. క్లా్లట్ యూజీకి పోటీ అధికంగా ఉంటుంది. కాబట్టి సిలబస్‌ను, గత ప్రశ్న పత్రాలను పరిశీలించి.. సెక్షన్ల వారీగా పటిష్ట ప్రణాళికతో ప్రిపరేషన్ సాగించాలి. అయిదు సెక్షన్లలోనూ మెరుగైన ప్రతిభ చూపే ప్రయత్నం చేయాలి.
President draupadi murmu News: టీచర్‌గా రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము
ఇంగ్లిష్ లాంగ్వేజ్
ఇంగ్లిష్ లాంగ్వేజ్ నైపుణ్యాన్ని పరిశీలించే ఈ సబ్జెక్ట్‌లో ప్యాసేజ్ ఆధారిత ప్రశ్నలు ఉంటాయి. ఈ విభాగంలో రాణించడానికి కాంప్రహెన్షన్, ప్యాసేజ్ రీడింగ్‌పై అవగాహన ఏర్పరచుకోవాలి. సునిశిత పరిశీలన నైపుణ్యం, ఇచ్చిన ప్యాసేజ్ సారాంశాన్ని గ్రహించడం, ప్యాసేజ్ ప్రధాన ఉద్దేశం తెలుసుకోవడం వంటి నైపుణ్యాలు పెంచుకోవాలి. ఇందుకోసం జనరల్ ఎస్సేలు, న్యూస్ పేపర్ ఎడిటోరియల్స్, ఇతర ముఖ్య ప్రచురణలు చదవాలి.
కరెంట్ అఫైర్స్, జనరల్ నాలెడ్జ్
సమకాలీన అంశాలు, కళలు, సంస్కృతి, అంతర్జాతీయ వ్యవహారాలు, ప్రాధాన్యత కలిగిన చారిత్రక అంశాలకు సంబంధించిన ప్యాసేజ్‌లు ఇచ్చి వీటి నుంచి ప్రశ్నలు అడుగుతారు. అభ్యర్థులు జాతీయోద్యమంలో కీలక ఘట్టాలపై దృష్టి పెట్టాలి. భారత రాజ్యాంగానికి సంబంధించి రాజ్యాంగ రూపకల్పన నుంచి తాజా సవరణల వరకూ.. అన్నీ తెలుసుకోవాలి. కరెంట్ అఫైర్స్‌కు సంబంధించి అంతర్జాతీయ స్థాయిలో ద్వైపాక్షిక ఒప్పందాలు, ముఖ్యమైన సంఘటనలు, సదస్సుల గురించి పూర్తి స్థాయి అవగాహన పెంచుకోవాలి.
Paris Olympics: ఒలింపిక్ కమిటీకి ఏకగ్రీవంగా ఎన్నికైన నీతా అంబానీ!
లీగల్ రీజనింగ్
న్యాయపరమైన దృక్పథం, సహేతుక ఆలోచన ధోరణి, నిర్ణయ సామర్థ్యాలను పరీక్షించే విభాగం ఇది. ఇందులో ప్యాసేజ్ ఆధారిత ప్రశ్నలు అడుగుతారు. సంబంధిత ప్యాసేజ్‌ల నుంచి నిబంధనలు, సిద్ధాంతాలు, వాస్తవాలు, వాటిద్వారా చోటు చేసుకుంటున్న మార్పులకు సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. నిర్దిష్టంగా ఒక సంఘటన, వివాదాన్ని పరిష్కరించేందుకు అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం కనుగొనే నైపుణ్యం పొందాలి. ముఖ్యమైన చట్టాలు, న్యాయ శాఖకు సంబంధించి ఇటీవల కాలంలో చోటు చేసుకున్న తాజా పరిణామాలు, లీగల్ టెర్మినాలజీపై అవగాహన ఏర్పరచుకోవడం కూడా ఈ విభాగంలో మంచి మార్కులకు దోహదం చేస్తుంది.
లాజికల్ రీజనింగ్
తార్కిక విశ్లేషణ సామర్థ్యాన్ని పరీక్షించే ప్రశ్నలు ఉండే విభాగం ఇది. ఇందులోనూ ప్యాసేజ్ ఆధారిత ప్రశ్నలకే ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. ఈ విభాగంలో ప్యాసేజ్ ఆధారిత ప్రశ్నలు; అసెర్షన్ అండ్ రీజనింగ్ విధానంలో ప్రశ్నలు అడుగుతారు. ఇందుకోసం సిలాజిజమ్, కోడింగ్–డీ కోడింగ్, డైరెక్షన్, అనాలజీ, సిరీస్, సీటింగ్ అరేంజ్‌మెంట్ వంటి అంశాలపై అవగాహన పొందాలి. స్టేట్‌మెంట్ ఆధారిత ప్రశ్నల కోసం కంపేరిటివ్ అప్రోచ్‌ను అలవర్చుకోవాలి.
Indian Air Force Admissions: ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో ప్రవేశాలకు దరఖాస్తులు
క్వాంటిటేటివ్ టెక్నిక్స్
ఈ విభాగంలో రాణించేందుకు పదో తరగతి స్థాయిలోని గణిత అంశాలపై పట్టు సాధించాలి. గత ప్రశ్న పత్రాలను పరిశీలిస్తే.. అర్థమెటిక్‌కు కొంత ఎక్కువ వెయిటేజీ కనిపిస్తోంది. కాబట్టి పర్సంటేజెస్, టైమ్ అండ్ డిస్టెన్స్, టైమ్ అండ్ స్పీడ్, యావరేజెస్, రేషియోస్ తదితర అంశాలను ప్రాక్టీస్ చేయాలి. గ్రాఫ్‌లు, చార్ట్‌లను విశ్లేషించే నైపుణ్యం సొంతం చేసుకోవాలి.
క్లాట్ పీజీకి ఇలా
తాజాగా ముఖ్యమైన తీర్పులు, రాజ్యాంగ, శాసనపరమైన అంశాలు, చారిత్రాత్మక తీర్పులు, వాటి ప్రభావం వంటి అంశాలపై అవగాహన పెంచుకోవాలి. తాము ఎంపిక చేసుకోనున్న స్పెషలైజేషన్‌కు సంబంధించి అకడమిక్‌గా బ్యాచిలర్ స్థాయిలోని అంశాలపై పట్టు సాధించడం మేలు చేస్తుంది.
Passport: అత్యంత శక్తిమంతమైన పాస్‌పోర్ట్‌ల జాబితాలో వెనకబడ్డ భారత్.. మొదటి స్థానంలో ఉన్న దేశం ఇదే!
కెరీర్ అవకాశాలు
క్లాట్‌లో విజయంతో నేషనల్ లా యూనివర్సిటీల్లో అడుగు పెట్టి కోర్సులు పూర్తి చేసుకున్న వారికి ఉజ్వల కెరీర్ అవకాశాలు ఖాయమని చెప్పొచ్చు. న్యాయవాద వృత్తి మాత్రమే కాకుండా.. కార్పొరేట్ కొలువులు సైతం సొంతం చేసుకునే అవకాశం లభిస్తుంది. ప్రస్తుతం అంతర్జాతీయ వాణిజ్య విధానాలు, పలు దేశాల కంపెనీల మధ్య ఒప్పందాలతో కార్యకలాపాలు జరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఎదురయ్యే న్యాయ సమస్యల పరిష్కారానికి సంస్థలు న్యాయ నిపుణులను నియమించుకుంటున్నాయి. నేషనల్ లా యూనివర్సిటీల్లో కార్పొరేట్ సంస్థలు క్యాంపస్ రిక్రూట్‌మెంట్స్ సైతం నిర్వహిస్తున్నాయి. క్యాంపస్ డ్రైవ్స్‌లో సగటున రూ.8 లక్షల వార్షిక వేతనంతో కొలువులు ఖరారవుతున్నాయి.
Menstrual Leave Policy: గుడ్‌న్యూస్.. నెలసరి సెలవు విధానం అమలు.. ఏ రాష్ట్రంలో అంటే..
Tags
- Law entrance exam
- CLAT 2025 notification
- common law entrance test
- law colleges admissions
- law colleges and universities
- admissions
- law admissions notifications
- online applications
- CLAT exam dates
- Law universities admissions
- Education News
- AIIMSDeoghar
- FacultyRecruitment
- AIIMSFaculty
- MedicalJobs
- AIIMSJobs
- DeogharRecruitment
- FacultyPositions
- AIIMSRecruitment
- latest jobs in 2024
- sakshieducation latest job notifications in 2024