Skip to main content

State Military Schools Admissions : రాష్ట్రీయ మిలిటరీ స్కూళ్లలో ఈ తరగతుల్లో ప్రవేశాలకు సెట్ నోటిఫికేష‌న్ విడుద‌ల‌..

దేశవ్యాప్తంగా రాష్ట్రీయ మిలిటరీ స్కూళ్లలో 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఆరో తరగతి, తొమ్మిదో తరగతిలో ప్రవేశాలకు రాష్ట్రీయ మిలిటరీ స్కూల్స్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌(సెట్‌) 2025–26 నోటిఫికేషన్‌ విడుదలైంది.
CET 2025-26 admission information for Rashtriya Military Schools  Rashtriya Military Schools entrance exam details for 2025-26  CET Notification for admissions at state military schools  Rashtriya Military Schools CET 2025-26 notification  Class VI and IX admissions notification for Rashtriya Military Schools

ఈ మిలిటరీ స్కూళ్లలో అడ్మిషన్‌ పొందడానికి ఆర్మీ నిర్వహించే కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ రాయాల్సి ఉంటుంది. రాష్ట్రీయ మిలిటరీ పాఠశాలల్లో ఆరో తరగతి నుంచి పన్నెండో తరగతి వరకు బాలబాలికలకు విద్యా బోధన ఉంటుంది. వీటిలో రక్షణ విభాగాల సిబ్బంది పిల్లలు, అలాగే, ఇతర వర్గాల పౌరులు పిల్లలు చదువుకోవచ్చు.
NASA: మానవులు సృష్టించిన మొట్టమొదటి ఉల్కాపాతం.. భూమిపైకి చేరుకునే అవకాశం
ఈ పాఠశాలలను రక్షణ మంత్రిత్వ శాఖ నిర్వహిస్తుంది. ఇవి ఆంగ్ల మాధ్యమంలో నడిచే రెసిడెన్షియల్‌ పబ్లిక్‌ స్కూళ్లు. ➦  మిలిటరీ స్కూళ్లు ఉన్న ప్రాంతాలు: చైల్‌(హిమాచల్‌ ప్రదేశ్‌), అజ్మీర్‌(రాజస్థాన్‌), ధోల్‌పూర్‌(రాజస్థాన్‌),బెల్గాం(కర్ణాటక), బెంగళూరు(కర్ణాటక).
➦  అర్హత: ఆరో తరగతిలో ప్రవేశం పొందడానికి విద్యార్థి ప్రభుత్వ/ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాల నుంచి ఐదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. ప్రస్తుత విద్యా సంవత్సరం ఐదో తరగతి చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తుకు అర్హులు. తొమ్మిదో తరగతిలో ప్రవేశానికి, విద్యార్థి ప్రభుత్వ/ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాల నుంచి ఎనిమిదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. ప్రస్తుత విద్యా సంవత్సరం ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తుకు అర్హులు.
➦  వయసు: ఆరో తరగతిలో ప్రవేశం పొందడానికి 2025 మార్చి 31 నాటికి విద్యార్థి వయసు 10 నుంచి 12 ఏళ్ల మధ్య ఉండాలి. తొమ్మిదో తరగతిలో ప్రవేశానికి,2025,మార్చి 31నాటికి అభ్యర్థి వయస్సు 13ఏళ్ల కంటే తక్కువ,15 ఏళ్ల కంటే ఎక్కువ ఉండకూడదు.
➦  ఎంపిక ప్రక్రియ: కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్, ఇంట­ర్వ్యూ, మెడికల్‌ ఫిట్‌నెస్, ఇతర రిజర్వేషన్లను అనుసరించి సీటు కేటాయిస్తారు. మల్టిపుల్‌ ఛాయిస్‌ ఓఎమ్మార్‌ ఆధారిత విధానంలో ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. 
➦  పరీక్ష విధానం:  ఆరో తరగతి: ఇంటెలిజెన్స్‌(50 మార్కులు), జనరల్‌ నాలెడ్జ్‌–కరెంట్‌ అఫైర్స్‌(50 మార్కులు), మ్యాథ్స్‌(50 మార్కులు), ఇంగ్లిష్‌(50 మార్కులు), ఐదో తరగతి స్థాయిలో ప్రశ్నలు అడుగుతారు. ఇంటర్వ్యూకు 20 మార్కులు.
తొమ్మిదో తరగతి: ఇంగ్లిష్‌(50 మార్కులు), హిందీ(20 మార్కులు), సోషల్‌ సైన్స్‌(30 మార్కులు), మ్యాథ్స్‌(50 మార్కులు), సైన్స్‌(50 మార్కులు), ఎనిమిదో తరగతి స్థాయిలో ప్రశ్నలు అడుగుతారు. ఇంటర్వ్యూకు 50 మార్కులు.
దరఖాస్తు విధానం:ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు చెల్లించడానికి చివరితేది: 19.09.2024.
వెబ్‌సైట్‌: www.rashtriyamilitaryschools.edu.in

Supreme Court: సుప్రీంకోర్టు కొత్త జెండా, చిహ్నాన్ని ఆవిష్కరించిన రాష్ట్రపతి

Published date : 04 Sep 2024 11:09AM

Photo Stories