Skip to main content

NASA: మానవులు సృష్టించిన మొట్టమొదటి ఉల్కాపాతం.. భూమిపైకి చేరుకునే అవకాశం

ప్రపంచ చరిత్రలో మానవులు సృష్టించిన మొట్టమొదటి ఉల్కాపాతం(మిటియోర్‌)గా డైమార్ఫోస్‌ ఉల్కపాతం రికార్డుకు ఎక్కబోతోందని అంతరిక్ష పరిశోధకులు చెబుతున్నారు.
NASA spacecraft collision may have created a meteor shower that will last for 100 years

భూగోళం వైపు దూసుకొస్తూ ముప్పుగా మారిన గ్రహశకలాలను దారి మళ్లించడానికి అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’ సైంటిస్టులు డబుల్‌–అస్టరాయిడ్‌ రీడైరెక్షన్‌ టెస్టు(డార్ట్‌) నిర్వహించారు. ఈ ప్రయోగం కోసం డైమార్ఫోస్‌ అనే గ్రహశకలాన్ని (అస్టరాయిడ్‌) ఎంచుకున్నారు.

నిజానికి ఈ అస్టరాయిడ్‌తో భూమికి ముప్పు లేనప్పటికీ ప్రయోగానికి అనువుగా ఉండడంతో ఎంపిక చేశారు. ‘డార్ట్‌’లో భాగంగా 2021 నవంబర్‌ 24న స్పేస్‌క్రాఫ్ట్‌ను ప్రయోగించారు. ఇది 2022 సెప్టెంబర్ 26వ తేదీ భూమికి 1.1 కోట్ల కిలోమీటర్ల మైళ్లు) దూరంలో ఉన్న డైమార్ఫోస్‌ను గంటకు 13,645 కిలోమీటర్ల వేగంతో విజయవంతంగా ఢీకొట్టింది. దాంతో ఆ గ్రహశకలం దారిమళ్లింది. భవిష్యత్తులో గ్రహశకలాల నుంచి భూమికి ముప్పు తప్పించడానికి డార్ట్‌ ప్రయోగం దోహదపడింది.  

Climate Change: మానవ జీవనాన్ని చిన్నాభిన్నం చేస్తున్న వాతావ'రణం'.. నిరాశ్రయులవనున్న 4.50 కోట్ల మంది!!

10 లక్షల కిలోల రాళ్లు, దుమ్ము ధూళి
నాసా స్పేస్‌క్రాఫ్ట్‌ అత్యంత వేగంగా ఢీకొట్టడంతో డైమార్ఫోస్‌ నుంచి చిన్నచిన్న రాళ్లు, దుమ్ము ధూళీ వెలువడుతున్నట్లు గుర్తించారు. 2 మిలియన్‌ పౌండ్లకు (10 లక్షల కిలోలు) పైగా బరువైన రాళ్లు, దుమ్ము ధూళి వెలువడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. వీటిని దాదాపు 7 రైలు పెట్టెల్లో నింపొచ్చు. వీటిలో కొన్ని ఇసుక పరిమాణంలో, మరికొన్ని సెల్‌ఫోన్‌ పరిమాణంలో ఉంటాయని చెబుతున్నారు. అయితే, డైమార్ఫోస్‌ నుంచి వెలువడిన రాళ్లు, ధూళి చివరకు ఎక్కడికి చేరుకుంటాయన్నది ఆసక్తికరంగా మారింది. 

ఇవి మరో 30 సంవత్సరాల్లోగా భూమి, అంగారక గ్రహాల సమీపంలోకి చేరుకుంటా యని చెబు తున్నారు. కొన్ని రాళ్లు, ధూళి మరో ఏడేళ్లలో అరుణ గ్రహానికి చేరే అవకాశం ఉందని అంటున్నారు. మరో పదేళ్లలో చిన్నపాటి రాళ్లు భూవాతావరణంలోకి ప్రవేశిస్తాయని అంచనా వేస్తున్నారు. చాలా చిన్నవి కావడంతో ఇవి భూమి ని ఢీకొట్టినా ఎలాంటి ప్రమాదం ఉండదని భరో సా ఇస్తున్నారు.

Radio Signal: ఆశ్చర్యం.. అంతరిక్షం నుంచి అంతుచిక్కని రేడియో సిగ్నల్స్‌

డైమార్ఫోస్‌ నుంచి వెలువడిన రాళ్లు, ధూళి ఉలా్కపాతాలుగా మారి భూమి, అంగారక గ్రహంపైకి చేరడం 100 సంవత్సరాలపాటు కొన సాగుతుందని ఇటలీలోని పాలిటెక్నిక్‌ యూనివర్సిటీ ఆఫ్‌ మిలన్‌కు చెందిన డీప్‌–స్పేస్‌ అస్ట్రోడైనమిక్స్‌ రీసెర్చ్‌ అండ్‌ టెక్నాలజీ గ్రూప్‌ పోస్టు డాక్టోరల్‌ పరిశోధకుడు అసెన్సియో చెప్పారు.

Published date : 03 Sep 2024 06:59PM

Photo Stories