Skip to main content

Passport: అత్యంత శక్తిమంతమైన పాస్‌పోర్ట్‌ల జాబితాలో భారత్ ఎన్నో స్థానంలో ఉందో తెలుసా?

హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ తాజాగా ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్ట్‌ల జాబితాను విడుదల చేసింది.
Henley Passport Index Released World's Most Powerful Passports 2024 List

అంతర్జాతీయ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ (IATA) నుంచి వచ్చిన డేటా ఆధారంగా ర్యాంకింగ్స్ ఇచ్చారు.

ఈ తాజా ర్యాంకింగ్‌లో భారతదేశానికి చెందిన పాస్‌పోర్ట్ 82వ స్థానంలో ఉంది. అంటే గతంతో పోలిస్తే భారత్ మూడు స్థానాలు పైకి ఎగబాకింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో మన దేశం 85వ స్థానంలో ఉంది. భారత పాస్‌పోర్ట్‌తో వీసా లేకుండానే ఇండోనేషియా, మలేషియా, థాయ్‌లాండ్‌ వంటి ప్రపంచంలోని 58 దేశాలకు ప్రయాణించవచ్చు. గతంలో ఈ అనుమతి  59 దేశాలకు ఉండేది. 

ఈ జాబితాలో సెనెగెల్‌, తజకిస్థాన్‌ దేశాలు 82వ స్థానంలోఉన్నాయి.  పాకిస్థాన్‌ 100వ స్థానంలో ఉంది. ఆ దేశ పాస్‌పోర్ట్‌తో 33 దేశాలకు వీసా లేకుండా వెళ్లొచ్చు. ఇక ఈ జాబితాలో అట్టడుగున 103వ స్థానంలో అఫ్గానిస్థాన్‌ ఉంది. ఆ దేశ పాస్‌పోర్ట్‌ కలిగినవారు 26 దేశాలకు వీసా రహిత ప్రయాణాలు చేయొచ్చు.

India's Population: 170 కోట్లు చేరుకోనున్న భారతదేశ జనాభా.. ఎప్పటిలోపు అంటే..?!

★ శక్తిమంతమైన పాస్‌పోర్ట్‌ల జాబితాలో 195 దేశాలకు యాక్సెస్‌తో సింగపూర్ మొదటి స్థానంలో ఉండగా, ఆప్గనిస్థాన్ చివరి స్థానంలో ఉంది. 

★ ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, స్పెయిన్ (192) రెండో స్థానంలో ఉన్నాయి.
★ ఆస్ట్రియా, ఫిన్‌లాండ్, ఐర్లాండ్, లక్సెంబర్గ్, నెదర్లాండ్స్, దక్షిణ కొరియా, స్వీడన్ (191) మూడో స్థానంలో ఉన్నాయి.

★బెల్జియం, డెన్మార్క్, న్యూజిలాండ్, నార్వే, స్విట్జర్లాండ్, యునైటెడ్ కింగ్డమ్ (190) నాలుగో స్థానంలో ఉన్నాయి.
★ ఆస్ట్రేలియా, పోర్చుగల్ (189) ఐదో స్థానంలో ఉన్నాయి.
★ గ్రీస్, పోలాండ్ (188) ఆరో స్థానంలో ఉన్నాయి.

★ కెనడా, చెకియా, హంగరీ, మాల్టా (187) ఏడో స్థానంలో ఉన్నాయి.
★ యునైటెడ్ స్టేట్స్ (186) ఎనిమిదో స్థానంలో ఉన్నాయి.
★ ఎస్టోనియా, లిథువేనియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (185) తొమ్మిదో స్థానంలో ఉన్నాయి.
★ ఐస్లాండ్, లాట్వియా, స్లోవేకియా, స్లోవేనియా (184) ప‌దో స్థానంలో ఉన్నాయి.

World Population: 1000 కోట్లు దాటనున్న ప్రపంచ జనాభా.. ఎప్ప‌టిలోపు అంటే..

Published date : 25 Jul 2024 06:14PM

Photo Stories