India's Population: 170 కోట్లు చేరుకోనున్న భారతదేశ జనాభా.. ఎప్పటిలోపు అంటే..?!
Sakshi Education
‘ది వరల్డ్ పాపులేషన్ ప్రాస్పెక్ట్స్ 2024’ పేరిట ఐక్యరాజ్యసమితి ఆర్థిక, సామాజిక వ్యవహారాలు, జనాభా విభాగం తాజాగా ఒక నివేదికను వెల్లడించింది.
ఈ నివేదిక ప్రకారం, భారతదేశ జనాభా 2100 నాటికి 150 కోట్లకు పడిపోతుందని అంచనా వేయబడింది. అయితే, ఆ శతాబ్దం చివరి వరకు కూడా ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ నిలిచి ఉంటుందని ఊహించబడుతోంది.
ముఖ్యమైన అంశాలు ఇవే..
- 2060 నాటికి భారత జనాభా 170 కోట్లకు చేరుకుని, ఆ తర్వాత క్రమంగా తగ్గుతూ 2100 నాటికి 150 కోట్లకు చేరుకుంటుంది.
- 2054 నాటికి, 169 కోట్లకు చేరుకున్న భారత జనాభా, ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా నిలుస్తుంది.
- 2100 నాటికి చైనా జనాభా 63.3 కోట్లకు పడిపోతుంది. 2024 నుంచి 2054 మధ్య 20.4 కోట్ల మంది చైనా జనాభా తగ్గుతారు.
- ప్రపంచవ్యాప్తంగా.. 126 దేశాల్లో జనాభా పెరుగుదల కొనసాగుతుంది. 2054 నాటికి ఈ జనాభా విస్ఫోటం గరిష్ట స్థాయికి చేరుకుంటుంది. భారత్, ఇండోనేసియా, నైజీరియా, పాకిస్తాన్, అమెరికా వంటి దేశాల్లో ఈ జనాభా విస్ఫోటం కనిపించనుంది.
- 5 సంవత్సరాలలోపు చనిపోయే పిల్లల సంఖ్య 2023లో 5 లక్షలకు దిగజారింది. ఇది చరిత్రలోనే అత్యల్పం. చిన్నారుల మరణాల్లో 95 శాతం జనాభా బాగా పెరుగుతున్న కాంగో, భారత్, పాకిస్తాన్, నైజీరియా వంటి 126 దేశాల్లో నమోదవుతున్నాయి.
- 2024లో ప్రపంచవ్యాప్త సగటు ఆయుర్దాయం 73.3 సంవత్సరాలుగా నమోదైంది. 1995 తో పోలిస్తే 8.4 సంవత్సరాలు పెరిగింది.
- 2054 నాటికి, పాకిస్తాన్ జనాభా 38.9 కోట్లకు చేరుకుని, అమెరికాను అధిగమిస్తుంది. 2100 నాటికి మూడో అతిపెద్ద దేశంగా అవతరిస్తుంది.
IPE Global: జర జాగ్రత్త సుమా.. ప్రచండమైన ఎండలతో అల్లాడుతున్న భూమి!
Published date : 16 Jul 2024 09:51AM