Skip to main content

Hydrogen Cruise: భారతదేశంలోనే తొలి హైడ్రోజన్‌ క్రూయిజ్‌.. ఎక్కడంటే..

భారతదేశంలో తొలి హైడ్రోజన్‌ క్రూయిజ్‌ను వారణాసిలో నడపనున్నారు.
India's First Hydrogen Powered Ferry in Varanasi  Hydrogen Cruise at Varanasi  Varanasi Hydrogen Boat Arrival  Ramnagar Multimodal Terminal Hydrogen Ship  Kochi Shipyard Hydrogen Cruise

ఈ క్రూయిజ్ జూలై 14వ తేదీ వారణాసికి చేరుకుంది. మొదట ఈ హైడ్రోజన్ క్రూయిజ్‌ను నమో ఘాట్‌కు తీసుకువచ్చి, తరువాత రామ్‌నగర్‌లోని మల్టీమోడల్ టెర్మినల్‌కు తరలించారు. ఈ క్రూయిజ్ కొచ్చిలోని షిప్‌యార్డ్‌లో అనేక సౌకర్యాలతో నిర్మితమయ్యింది.

ఈ క్రూయిజ్‌లో 50 మంది ప్రయాణికులు కూర్చునేందుకు అవకాశం ఉంది. కాలుష్యాన్ని ఉత్పత్తి చేయకుండా గంగానదిలో నడిచే తొలి క్రూయిజ్‌ ఇది. ఈ క్రూయిజ్ వారణాసి-చునార్ మధ్య నడుస్తుంది. దీనిని పర్యాటక శాఖ పర్యవేక్షించనుంది.

ఈ క్రూయిజ్‌ నిర్వహణ కోసం వారణాసిలోని రామ్‌నగర్ మల్టీ మోడల్ టెర్మినల్‌లో తాత్కాలిక హైడ్రోజన్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్నారు. హైడ్రోజన్ శక్తితో నడిచే ఈ క్రూయిజ్‌లో ఎలక్ట్రిక్ ఇంజన్ కూడా అమర్చారు. తద్వారా హైడ్రోజన్ ఇంధనం తగ్గినప్పుడు, క్రూయిజ్‌ను ఎలక్ట్రిక్ ఇంజిన్‌తో నడపవచ్చు. వారణాసి తర్వాత అయోధ్య, మథురలలో కూడా ఈ క్రూయిజ్‌ను నడపాలని ప్రభుత్వం యోచిస్తోంది.

Viraat Ramayan Mandir: అయోధ్య ఆలయాన్ని మించి నిర్మితమవున్న రామాలయం.. ఎక్క‌డంటే..

Published date : 15 Jul 2024 03:02PM

Photo Stories