Skip to main content

Russia Ukraine War: క్షిపణులతో విరుచుకుపడ్డ రష్యా.. 31 మంది మృతి!

దాదాపు నాలుగు నెలల విరామం తర్వాత రష్యా క్షిపణులతో ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌పై దాడి చేసింది.
Russian missiles kill 36 in Ukraine

జూలై 8వ తేదీన జరిగిన ఈ దాడుల్లో మౌలిక సదుపాయాలు, విద్యుత్ వ్యవస్థలు లక్ష్యంగా 40కి పైగా క్షిపణులు ప్రయోగించబడ్డాయి. ఈ దాడుల్లో కనీసం 31 మంది మృతి చెందగా, 154 మంది గాయపడ్డారని అధికారులు వెల్లడించారు.

➤ కీవ్‌లోని చిన్నారుల ఆస్పత్రి సహా పలు నివాస ప్రాంతాలపై క్షిపణులు పడ్డాయి.
➤ రాజధాని కీవ్‌లోని 10 జిల్లాల్లో ఏడు జిల్లాల్లో దాడులు జరిగాయి.
➤ ఒక మూడు అంతస్తుల నివాస భవనం పూర్తిగా ధ్వంసమైంది.
➤ మరో నగరం క్రివ్యి రిహ్‌లో 10 మంది మృతి చెందగా, 47 మంది గాయపడ్డారు.
➤ కీవ్‌లోని రెండంతస్తుల చిన్నారుల ఆస్పత్రిలోని ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, ఆంకాలజీ విభాగాలు దెబ్బతిన్నాయి.
➤ ఆస్పత్రి భవనం కిటికీలు, తలుపులు ధ్వంసమయ్యాయి.
➤ ఆస్పత్రిపై దాడిలో ఏడుగురు చిన్నారులు సహా 16 మంది గాయపడినట్లు మేయర్‌ విటాలి క్రిట్చ్‌కో చెప్పారు. ప్రాణ నష్టం వివరాలు తెలియాల్సి ఉందని అధ్యక్షుడు జెలెన్‌స్కీ తెలిపారు. 

Top Court Rules: చారిత్రాత్మక తీర్పు.. బలవంతపు ‘కుటుంబ నియంత్రణ’ బాధితులకు పరిహారం
 
క్షిపణాల రకాలు ఇవే..
➤ రష్యా ధ్వని కంటే 10 రెట్లు వేగంగా ప్రయాణించే హైపర్‌సోనిక్ కింఝాల్ మిస్సైళ్లను కూడా ప్రయోగించింది.
➤ ఉక్రెయిన్ సైనిక వర్గాలు మొత్తం 40 క్షిపణుల్లో 30 వరకు కూల్చివేశామని, వాటిలో 11 కింఝాల్ క్షిపణులు ఉన్నాయని తెలిపాయి.

Published date : 10 Jul 2024 10:24AM

Photo Stories