Skip to main content

Top Court Rules: చారిత్రాత్మక తీర్పు.. బలవంతపు ‘కుటుంబ నియంత్రణ’ బాధితులకు పరిహారం

జపాన్‌ సుప్రీంకోర్టు ఒక చారిత్రాత్మక తీర్పును వెలువరించింది.
Japan's Top Court Rules forced Sterilisation Law Unconstitutional Orders

దేశంలో 'యూజెనిక్స్ ప్రొటెక్షన్‌ లా' కింద బలవంతంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసిన బాధితులకు నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ చట్టం కింద శారీరక వికలాంగులు పిల్లలను కనకుండా నిరోధించడానికి 1950-1970 మధ్యకాలంలో దాదాపు 25,000 మందికి వారి అనుమతి లేకుండా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేశారు.

ఈ చట్టాన్ని యుద్ధానంతర కాలంలో జరిగిన అతిపెద్ద మానవ హక్కుల ఉల్లంఘనగా జపాన్‌ న్యాయవాదులు అభివర్ణించారు. ఈ నేపధ్యంలో 1948 నాటి ఈ చట్టం రాజ్యాంగ విరుద్ధమని కోర్టు తీర్పు ఇచ్చింది.

తీర్పు అనంతరం బాధితులు సుప్రీంకోర్టు న్యాయవాదులకు కృతజ్ఞతలు తెలిపారు. 81 ఏళ్ల వాది సబురో కితా మీడియాతో మాట్లాడుతూ "నేను ఇప్పుడు నా ఆనందాన్ని వ్యక్తపరచలేకపోతున్నాను. 1957లో 14 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు బలవంతంగా నాకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌ చేశారు. అనాథాశ్రమంలో ఉన్నప్పుడు ఇది జరిగింది. ఈ విషయాన్ని నా భార్య చనిపోయే ముందు ఆమెకు తెలిపాను. తన వల్లే పిల్లలు పుట్టలేదని భార్య ముందు పశ్చాత్తాప పడ్డాను" అని తెలిపారు.

EIU Global Liveability Index: ప్రపంచంలోనే అత్యంత నివాసయోగ్యమైన టాప్ 10 నగరాలు ఇవే..

Published date : 05 Jul 2024 10:35AM

Photo Stories