Skip to main content

AP Election Results Live Updates: ఏపీ ఎన్నికల ఫలితాలు.. కౌంటింగ్‌ లైవ్‌ అప్‌డేట్స్ ఇవే..

ఆంధ్రప్రదేశ్‌లో ఈ రోజు (జూన్ 4వ తేదీ) ఎన్నికల ఫలితాలు విడుద‌ల కానున్నాయి.
Andhra Pradesh Election Results 2024 Live Updates

రాష్ట్ర‌ వ్యాప్తంగా 33 ప్రాంతాల్లో 401 కౌంటింగ్‌ కేంద్రాలు ఉన్నాయి. మే 13వ తేదీన రాష్ట్ర అసెంబ్లీకి, లోక్‌సభ స్థానాలకు పోలింగ్‌ జరిగింది. ఈ ఏడాది పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు వేసిన 4.61 లక్షల మంది ఓటర్లు.. ఏపీలో మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, 25 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి.  

ఉదయం 8 గంటల నుంచి పోస్టల్‌ బ్యాలట్, ఈవీఎంల్లోని ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. తొలుత పోస్టల్‌ బ్యాలెట్లను, ఆ తర్వాత 8.30 గంటల నుంచి ఈవీఎంలలో నిక్షిప్తం అయిన ఓట్లను లెక్కిస్తారు. పోస్టల్‌ బ్యాలెట్‌ కౌంటింగ్‌ దాదాపు రెండున్నర గంటలు పట్టే అవకాశం ఉంది. పోస్టల్‌ బ్యాలెట్‌ లెక్కింపు త‌ర్వాత‌ ఈవీఎం ఓట్ల లెక్కింపు ఉంటుంది. 

ఈ రోజు మధ్యాహ్నానికి ఫలితాలపై స్పష్టత వస్తుంది. అయితే ఈవీఎం కంట్రోల్‌ యూనిట్ల ఓట్ల లెక్కింపు పూర్తి అయినప్పటికీ, ప్రతి నియోజకవర్గంలో ఐదు వీవీప్యాట్‌లలోని స్లిప్‌లను కూడా చివర్లో లెక్కించాల్సి ఉంటుంది. 

కౌంటింగ్‌ లైవ్‌ అప్‌డేట్స్ ఇవే..

➣ పోస్టల్‌ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రారంభం
➣ అభ్యర్థుల సమక్షంలో తెరుచుకున్న స్ట్రాంగ్‌ రూమ్‌లు 
➣ పోస్టల్‌ల్‌ లెక్కింపు కోసం ప్రత్యేక కౌంటర్లు
➣ ఎప్పడూ లేనంత హై అలర్ట్‌లో పార్టీల అభ్యర్థులు 

Andhra Pradesh Election Results 2024 Live Updates

➤ నంద్యాల జిల్లాకు సంబంధించి ఆరు నియోజకవర్గాల పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం. పటిష్ట బందోబస్తు మధ్య ఎన్నికల కౌంటింగ్ 

➤ పశ్చిమగోదావరి జిల్లాలోప్రారంభమైన పోస్టల్ బ్యాలెట్ల కౌంటింగ్.
నర్సాపురం పార్లమెంట్ పరిధిలో మొత్తం పోస్టల్ బ్యాలెట్ 13,340 ఓట్లు 

➤ పల్నాడులో.. నరసరావుపేట‌లోని కాకాని కౌంటింగ్ కేంద్రం వద్ద కుప్పకూలిన పడిపోయిన తెలుగుదేశం ఏజెంట్ గట్టినేని రమేష్. 108 సాయంతో హాస్పిటల్ హాస్పిటల్‌కి తరలింపు 

➤ అమలాపురం నియోజకవర్గ పరిధిలో చెయ్యేరు ఇంజనీరింగ్ కళాశాలలో కౌంటింగ్ హాళ్లను పరిశీలించిన కలెక్టర్ హ్యూమన్సు శుక్లా 

➤ ఏలూరు జిల్లాలో మొదలైన కౌంటింగ్ ప్రక్రియ స్ట్రాంగ్ రూముల నుంచి కౌంటింగ్ సెంటర్లకు ఈవీఎంలు తరలింపు. తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రారంభం. ఈ జిల్లాలో 17,500 పోస్టల్ ఓట్లు.

➤ తూర్పు గోదావరి.. రాజమండ్రి రూరల్‌ పోస్టల్ బ్యాలెట్.. ముందంజలో ఉన్న కూటమి అభ్యర్థి. రాజమండ్రి రూరల్ ఎంఎల్ఏ అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్యచౌదరి లీడ్‌. 5,795 ఓట్లకు పైగా ఆధిక్యం

➤ కడప ఎంపీ అభ్యర్థి అవినాష్‌రెడ్డి 4362(ఆధిక్యం).. భూపేష్ వెనుకంజ 2,088, షర్మిల-1101

➤ చీపురుపల్లిలో ఆధిక్యంలో ఉన్న బొత్స సత్యనారాయణ. గజపతినగరంలో అప్పలనర్సయ్య ఆధిక్యం..

➤ తిరుపతి ఎంపీ, అసెంబ్లీ స్థానాల్లో ఆధిక్యంలో ఉన్న వైఎస్సార్‌సీపీ 
➤ చంద్రగిరి అసెంబ్లీ స్థానంలో వైఎస్సార్‌సీపీ ఆధిక్యం

★ 9 గంట‌ల స‌మ‌యంలో వైఎస్సార్‌సీపీ 6 అసెంబ్లీ స్థానాల్లో, 1 లోక్‌సభ స్థానంలో ముందంజలో ఉండ‌గా.. టీడీపీ 2 అసెంబ్లీ స్థానాల్లో, 1 లోక్‌సభ స్థానంలో టాప్‌లో ఉంది.

➤ అనపర్తి, తిరువూరులో వైఎస్సార్‌సీపీ లీడ్‌
➤ హిందూపురం పార్లమెంట్‌ స్థానంలో వైఎస్సార్‌సీపీ ఆధిక్యం
➤ పుట్టపర్తిలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి శ్రీధర్‌రెడ్డి ముందంజ
➤ కడప పార్లమెంట్‌ స్థానంలో వైఎస్ అవినాష్‌రెడ్డి ఆధిక్యం 
➤ సర్వేపల్లిలో కాకాణి గోవర్థన్‌రెడ్డి ఆధిక్యం

➤ దర్శిలో వైఎస్సార్‌సీపీ ముందంజ
➤ అరకు పార్లమెంట్‌ స్థానంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి లీడ్ 
➤ విశాఖ లోక్ సభ స్థానానికి పోలైన సర్వీస్ ఓట్లు మొత్తం 1350
➤ ఆరు స్కానర్లు ద్వారా స్కాన్ చేస్తున్న సిబ్బంది.. పర్యవేక్షిస్తున్న ఆర్వోలు

➤ పులివెందులలో ముందంజలో ఉన్న సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 
➤ ఉదయగిరిలో మేకపాటి రాజగోపాల్‌రెడ్డి ఆధిక్యం

★ 9.40 గంట‌ల స‌మ‌యంలో వైఎస్సార్‌సీపీ 11 అసెంబ్లీ స్థానాల్లో, 5 లోక్‌సభ స్థానంలో ముందంజలో ఉండ‌గా.. టీడీపీ 39 అసెంబ్లీ స్థానాల్లో, 19 లోక్‌సభ స్థానంలో, జేఎస్‌పీ 5, బీజేపీ 2 అసెంబ్లీ స్థానాల్లో టాప్‌లో ఉన్నాయి.

➤ కడప పార్లమెంట్ పరిధిలో నాలుగవ రౌండ్ ముగిసేసరికి వైఎస్సార్‌సీపీ అభ్యర్థి అవినాష్‌రెడ్డి 13,182 ఓట్ల మెజార్టీతో ముందంజలో ఉన్నారు.

★ 10 గంట‌ల స‌మ‌యంలో వైఎస్సార్‌సీపీ 19 అసెంబ్లీ స్థానాల్లో, 4 లోక్‌సభ స్థానంలో ముందంజలో ఉండ‌గా.. టీడీపీ 72 అసెంబ్లీ స్థానాల్లో, 21 లోక్‌సభ స్థానంలో, జేఎస్‌పీ 11, బీజేపీ 3 అసెంబ్లీ స్థానాల్లో టాప్‌లో ఉన్నాయి.

★ 10.20 గంట‌ల స‌మ‌యంలో వైఎస్సార్‌సీపీ 15 అసెంబ్లీ స్థానాల్లో, 5 లోక్‌సభ స్థానంలో ముందంజలో ఉండ‌గా.. టీడీపీ 106 అసెంబ్లీ స్థానాల్లో, 20 లోక్‌సభ స్థానంలో, జేఎస్‌పీ 15, బీజేపీ 4 అసెంబ్లీ స్థానాల్లో టాప్‌లో ఉన్నాయి.

➤ గూడూరు అసెంబ్లీ నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి మూడో రౌండ్‌లో గురుమూర్తి 1596 ఓట్లు ఆధిక్యంలో ఉన్నారు. వైఎస్సార్‌సీపీ-12,687, బీజేపీ-11091.
➤ నాలుగు రౌండ్లు పూర్తయ్యేసరికి సర్వేపల్లి అభ్యర్థి కాకాణి గోవర్ధన్ రెడ్డి 107 ఓట్లు ఆధిక్యం

★ 10.40 గంట‌ల స‌మ‌యంలో వైఎస్సార్‌సీపీ 25 అసెంబ్లీ స్థానాల్లో, 3 లోక్‌సభ స్థానంలో ముందంజలో ఉండ‌గా.. టీడీపీ 94 అసెంబ్లీ స్థానాల్లో, 13 లోక్‌సభ స్థానంలో, జేఎస్‌పీ 12, బీజేపీ 4 అసెంబ్లీ స్థానాల్లో టాప్‌లో ఉన్నాయి.

➤ పుంగనూరులో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధిక్యంలో దిశగా దూసుకుపోతున్నారు.  
➤ నాలుగు రౌండ్లు ఫలితాలు ముగిసేరికి.. వైఎస్సార్‌సీపీ-22965, టీడీపీ-20921

➤ పలాస అసెంబ్లీ నియోజకవర్గం (రెండో రౌండ్).. వైఎస్సార్‌సీపీ-5110, టీడీపీ-12309

➤ టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గం (రెండో రౌండ్).. వైఎస్సార్‌సీపీ-5478, టీడీపీ-6263

➤ ఎచ్చెర్ల అసెంబ్లీ నియోజకవర్గం (నాలుగో రౌండ్).. వైఎస్సార్‌సీపీ-13805, టీడీపీ -17864

★ 11 గంట‌ల స‌మ‌యంలో వైఎస్సార్‌సీపీ 23 అసెంబ్లీ స్థానాల్లో, 5 లోక్‌సభ స్థానంలో ముందంజలో ఉండ‌గా.. టీడీపీ 105 అసెంబ్లీ స్థానాల్లో, 13 లోక్‌సభ స్థానంలో, జేఎస్‌పీ 13, బీజేపీ 4 అసెంబ్లీ స్థానాల్లో టాప్‌లో ఉన్నాయి.

★ 11.20 గంట‌ల స‌మ‌యంలో వైఎస్సార్‌సీపీ 22 అసెంబ్లీ స్థానాల్లో, 5 లోక్‌సభ స్థానంలో ముందంజలో ఉండ‌గా.. టీడీపీ 111 అసెంబ్లీ స్థానాల్లో, 13 లోక్‌సభ స్థానంలో, జేఎస్‌పీ 13, బీజేపీ 4 అసెంబ్లీ స్థానాల్లో టాప్‌లో ఉన్నాయి.

★ 11.20 గంట‌ల స‌మ‌యంలో వైఎస్సార్‌సీపీ 22 అసెంబ్లీ స్థానాల్లో, 5 లోక్‌సభ స్థానంలో ముందంజలో ఉండ‌గా.. టీడీపీ 113 అసెంబ్లీ స్థానాల్లో, 15 లోక్‌సభ స్థానంలో, జేఎస్‌పీ 13, బీజేపీ 5 అసెంబ్లీ స్థానాల్లో టాప్‌లో ఉన్నాయి.

★ 11.40 గంట‌ల స‌మ‌యంలో వైఎస్సార్‌సీపీ 23 అసెంబ్లీ స్థానాల్లో, 5 లోక్‌సభ స్థానంలో ముందంజలో ఉండ‌గా.. టీడీపీ 113 అసెంబ్లీ స్థానాల్లో, 20 లోక్‌సభ స్థానంలో, జేఎస్‌పీ 16, బీజేపీ 5 అసెంబ్లీ స్థానాల్లో టాప్‌లో ఉన్నాయి.

★ 12 గంట‌ల స‌మ‌యంలో వైఎస్సార్‌సీపీ 20 అసెంబ్లీ స్థానాల్లో, 4 లోక్‌సభ స్థానంలో ముందంజలో ఉండ‌గా.. టీడీపీ 126 అసెంబ్లీ స్థానాల్లో, 21 లోక్‌సభ స్థానంలో, జేఎస్‌పీ 20, బీజేపీ 6 అసెంబ్లీ స్థానాల్లో టాప్‌లో ఉన్నాయి.

★ 12.20 గంట‌ల స‌మ‌యంలో వైఎస్సార్‌సీపీ 20 అసెంబ్లీ స్థానాల్లో, 4 లోక్‌సభ స్థానంలో ముందంజలో ఉండ‌గా.. టీడీపీ 128 అసెంబ్లీ స్థానాల్లో, 21 లోక్‌సభ స్థానంలో, జేఎస్‌పీ 20, బీజేపీ 7 అసెంబ్లీ స్థానాల్లో టాప్‌లో ఉన్నాయి.

★ 12.40 గంట‌ల స‌మ‌యంలో వైఎస్సార్‌సీపీ 20 అసెంబ్లీ స్థానాల్లో, 4 లోక్‌సభ స్థానంలో ముందంజలో ఉండ‌గా.. టీడీపీ 128 అసెంబ్లీ స్థానాల్లో, 21 లోక్‌సభ స్థానంలో, జేఎస్‌పీ 20, బీజేపీ 7 అసెంబ్లీ స్థానాల్లో టాప్‌లో ఉన్నాయి.

➤ రాజమహేంద్రవరం (పట్టణం) టీడీపీ అభ్యర్థి ఆదిరెడ్డి వాసు.. వైఎస్సార్‌సీపీ  అభ్యర్థి మార్గాని భరత్‌రామ్‌పై గెలుపొందారు. 

➤ రాజమహేంద్రవరం (గ్రామీణం) టీడీపీ అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరి.. వైకాపా అభ్యర్థి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణపై విజయం సాధించారు.

➤ తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్య‌ర్థిగా పోటీ చేసిన నల్లమిల్లి రామకృష్ణారెడ్డి.. వైకాపా అభ్యర్థి ఎస్‌.సూర్యనారాయణరెడ్డిపై గెలుపొందారు.

★ ఒంటి గంట స‌మ‌యంలో వైఎస్సార్‌సీపీ 22 అసెంబ్లీ స్థానాల్లో, 5 లోక్‌సభ స్థానంలో ముందంజలో ఉండ‌గా.. టీడీపీ 127 అసెంబ్లీ స్థానాల్లో, 20 లోక్‌సభ స్థానంలో, జేఎస్‌పీ 19, బీజేపీ 7 అసెంబ్లీ స్థానాల్లో టాప్‌లో ఉన్నాయి.

★ 1.30 గంట‌ల స‌మ‌యంలో వైఎస్సార్‌సీపీ 16 అసెంబ్లీ స్థానాల్లో, 4 లోక్‌సభ స్థానంలో ముందంజలో ఉండ‌గా.. టీడీపీ 132 అసెంబ్లీ స్థానాల్లో, 21 లోక్‌సభ స్థానంలో, జేఎస్‌పీ 20, బీజేపీ 7 అసెంబ్లీ స్థానాల్లో టాప్‌లో ఉన్నాయి.

★ 2.20 గంట‌ల స‌మ‌యంలో వైఎస్సార్‌సీపీ 16 అసెంబ్లీ స్థానాల్లో, 4 లోక్‌సభ స్థానంలో ముందంజలో ఉండ‌గా.. టీడీపీ 132 అసెంబ్లీ స్థానాల్లో, 21 లోక్‌సభ స్థానంలో, జేఎస్‌పీ 20, బీజేపీ 7 అసెంబ్లీ స్థానాల్లో టాప్‌లో ఉన్నాయి.

★ 3.15 గంట‌ల స‌మ‌యంలో వైఎస్సార్‌సీపీ 13 అసెంబ్లీ స్థానాల్లో, 4 లోక్‌సభ స్థానంలో ముందంజలో ఉండ‌గా.. టీడీపీ 133 అసెంబ్లీ స్థానాల్లో, 21 లోక్‌సభ స్థానంలో, జేఎస్‌పీ 21, బీజేపీ 8 అసెంబ్లీ స్థానాల్లో టాప్‌లో ఉన్నాయి.

★ 4.20 గంట‌ల స‌మ‌యానికి వైఎస్సార్‌సీపీ 4, టీడీపీ 77, జేఎస్‌పీ 15, బీజేపీ 6 అసెంబ్లీ స్థానాల్లో గెలుపొందాయి.

★ 5.20 గంట‌ల స‌మ‌యానికి టీడీపీ 107, వైఎస్సార్‌సీపీ 6, జేఎస్‌పీ 19, బీజేపీ 7 అసెంబ్లీ స్థానాల్లో గెలుపొందాయి.

★ 6.45 గంట‌ల స‌మ‌యానికి టీడీపీ 134, వైఎస్సార్‌సీపీ 9, జేఎస్‌పీ 21, బీజేపీ 7 అసెంబ్లీ స్థానాల్లో గెలుపొందాయి.

★ ఏపీ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో టీడీపీ 135, వైఎస్సార్‌సీపీ 11, జేఎస్‌పీ 21, బీజేపీ 8 అసెంబ్లీ స్థానాల్లో గెలిచాయి.

Published date : 04 Jun 2024 09:17PM

Photo Stories