Omar Abdullah: నేషనల్ కాన్ఫెరెన్స్ శాసనసభా పక్షనేతగా ఒమర్
Sakshi Education

జమ్మూకశ్మీర్‌లో నేషనల్ కాన్ఫెరెన్స్ పార్టీ శాసనసభాపక్ష నేతగా ఆ పార్టీ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
అక్టోబర్ 10వ తేదీ పార్టీ కేంద్ర కార్యాలయం నవా-ఇ-సుబాహ్‌లో ఎన్సీ ఎమ్మెల్యేలంతా సమావేశమై ఒమరు ఎన్నుకున్నట్లు పార్టీ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా ప్రకటించారు. దీంతో జమ్మూకశ్మీర్ తదుపరి ముఖ్యమంత్రిగా ఒమర్ పేరు ఖరారైంది. జమ్మూకశ్మీర్‌లో నూతన ప్రభుత్వ ఏర్పాటు తేదీపై ఎన్సీ, కాంగ్రెస్ కూటమి నేతలు సమావేశమై నిర్ణయం తీసుకుంటారని ఫరూక్ చెప్పారు.
Assembly Election Results: జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్‌సీ–కాంగ్రెస్ కూటమి విజయం..
Published date : 14 Oct 2024 08:11AM