Skip to main content

Modi Followers: ‘ఎక్స్‌’లో మోదీ ఫాలోయర్లు 10 కోట్లు..!

సామాజిక మాధ్యమ వేదికలపై ఎల్లప్పుడూ చురుగ్గా ఉండే ప్రధాని మోదీ మరో మైలురాయిని అధిగమించారు.
PM Narendra Modi Becomes Most Followed Global Leader on X with Over 100 Million Followers

‘ఎక్స్‌’హ్యాండిల్‌లో ప్రధాని మోదీ ఫాలోయర్ల సంఖ్య రికార్డు స్థాయిలో 10 కోట్లను దాటిపోయింది. గత మూడేళ్లలో అదనంగా 3 కోట్ల మంది ఫాలోయర్లు నమోదవడంతో మోదీ ఈ ఘనత సాధించారు. సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌లో అత్యధిక ఫాలోయర్లు కలిగిన ప్రపంచ నేతల్లో ఒకరిగా ఆయనకు ఇప్పటికే పేరుంది.

దేశంలో ఆప్‌ నేత అరవింద్‌ కేజ్రీవాల్‌కు 2.75 కోట్ల మంది, కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌ గాంధీకి 2.64 కోట్ల మంది ఫాలోయర్లు ఉన్నారు. ప్రపంచ నేతల్లో అమెరికా అధ్యక్షుడు బైడెన్‌కు 3.81 కోట్ల మంది, తుర్కియే అధ్యక్షుడు ఎర్డోగన్‌కు 2.15 కోట్ల మంది ఫాలోయర్లు ఉన్నారు.

క్రీడాకారుల్లో క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీకి 6.41 కోట్ల మంది, ఫుట్‌బాల్‌ క్రీడాకారుడు నెయ్‌మార్‌కు 6.36 కోట్లు, అమెరికా బాస్కెట్‌ బాల్‌ క్రీడాకారుడు లెబ్రాన్‌ జేమ్స్‌కు 5.29 కోట్ల మంది ఫాలోయర్లు ఉన్నారని ‘ఎక్స్‌’అధికారి ఒకరు వివరించారు. అమెరికాకు చెందిన సెలెబ్రిటీ టేలర్‌ స్విఫ్ట్‌కు 9.53 కోట్లు, లేడీ గాగాకు 8.31 కోట్లు, కిమ్‌ కర్దాషియన్‌కు 7.52 కోట్ల మంది ఫాలోయర్లు ఉన్నట్లు తెలిపారు.

Healthy Snacking Report: ఆరోగ్యకరమైన స్నాక్స్‌ వైపు మొగ్గు చూపుతున్న భారతీయులు!

Published date : 16 Jul 2024 09:41AM

Photo Stories