SpaceX Falcon 9: కుప్పకూలనున్న 20 స్టార్‌లింక్ శాటిలైట్లు.. కారణం ఇదే..
జూలై 11వ తేదీన ప్రయోగించిన 20 స్టార్‌లింక్ ఉపగ్రహాలు త్వరలో కుప్పకూలనున్నాయని స్పేస్ ఎక్స్ స్వయంగా ధ్రువీకరించింది.
ప్రయోగం ప్రారంభమైన కొద్దిసేపటికే, ఫాల్కన్-9 రాకెట్ యొక్క రెండో దశ ఇంజన్ సకాలంలో మండటంలో విఫలమైంది. ఈ లోపం వలన, ఉపగ్రహాలు ఉద్దేశించిన కక్ష్యకు చేరుకోలేక, భూమికి దగ్గరగా ఉన్న కక్ష్యలోకి ప్రవేశించాయి. ఫలితంగా, వాటి మనుగడ అసాధ్యంగా మారింది, త్వరలో భూ వాతావరణంలోకి ప్రవేశించి కాలిపోతాయి.
స్పేస్ ఎక్స్ ఈ ఘటనను ధ్రువీకరించింది, ఈ 20 ఉపగ్రహాల వైఫల్యం వలన ఇతర ఉపగ్రహాలకు ఎటువంటి ముప్పు ఉండదని స్పష్టం చేసింది. అలాగే.. ఉపగ్రహాలు భూమిని తాకినా, జనావాసాలకు ఎటువంటి ముప్పు ఉండదని కూడా స్పష్టం చేసింది. ఈ ఘటన ఫాల్కన్-9 రాకెట్ చరిత్రలోనే తొలి భారీ వైఫల్యంగా పరిగణించబడుతుంది.
LHS 1140b: విశ్వంలో భూగోళం లాంటి మరో గ్రహం.. ఇది కూడా జీవుల నివాసయోగ్యమైన గ్రహమే!