LHS 1140b: విశ్వంలో భూగోళం లాంటి మరో గ్రహం!
ఇరత గ్రహాలపై జీవం ఉందా.. లేదా.. అనేది గుర్తించడానికి దశబ్ధాలుగా పరిశోధనలు జరుగుతున్నాయి. మానవ నివాసానికి ఆస్కారం ఉన్న మరో గ్రహం కోసం అన్వేషణ కొనసాగుతూనే ఉంది. నిజంగా ఇలాంటి గ్రహం ఒకటి దొరికితే అది మానవాళికి ఒక వరం అనే చెప్పాలి.
కెనడాలోని యూనివర్సిటీ ఆఫ్ మాంట్రియల్ సైంటిస్టులు ఈ దిశగా కొంత పురోగతి సాధించారు. బూగోళం లాంటి మరో గ్రహం ఉన్నట్లు గుర్తించారు. జేమ్స్ వెబ్ స్పేస్‌తో పాటు స్పిట్జర్, హబుల్ అంతరిక్ష టెలిస్కోప్‌లు సేకరించిన సమాచారాన్ని, చిత్రాలను క్రోడీకరించి ఈ సూపర్ ఎర్త్‌పై వాతావరణాన్ని అంచనా వేశారు.
భూమికి 48 కాంతి సంవత్సరాల దూరంలో రాళ్లు, నీటితో నిండి ఉన్న ఈ గ్రహాన్ని ఎల్‌హెచ్ఎస్ 1140బిగా పిలుస్తున్నారు. దీనిపై నీరు చాలావరకు ద్రవ రూపంలోనే ఉందని, బూమిపై మాదిరిగానే అక్కడ నైట్రోజన్ వాయువుతో కూడిన వాతావరణం ఉందని పరిశోధకులు చార్లెస్ కాడియక్స్ తెలిపారు. భూమి కంటే పెద్దదైన ఇది ఎరుపు రంగు మరుగుజ్జు నక్షత్రం చుట్టూ పరిభ్రమిస్తోందని వెల్లడించారు.
Are Extinct: భూమిని ఢీకొట్టే భారీ గ్రహశకలం.. అదే జరిగితే మానవజాతి అంతం!