Wimbledon Women's Title Winner: వింబుల్డన్ టైటిల్‌ను సొంతం చేసుకున్న చెక్ రిపబ్లిక్ మొదటి మహిళ ఈమెనే..
![Barbora Krejcikova Wins Wimbledon Women's Tennis title Barbara Krejcikova with Wimbledon trophy Tennis player Barbara Krejcikova with trophy Historic moment Krejcikova wins Wimbledon](/sites/default/files/images/2024/07/15/barbora-krejcikova-1721042450.jpg)
దీంతో క్రెజికోవా చెక్ రిపబ్లిక్‌కు చెందిన మొదటి మహిళల సింగిల్స్ ఛాంపియన్‌గా అవతరించింది. జూలై 13వ తేదీ జరిగిన ఫైనల్లో, క్రెజికోవా ఏడో సీడ్ జాస్మిన్ పావొలిని (ఇటలీ)పై 6-2, 2-6, 6-4తో హోరాహోరీగా సాగిన మూడు సెట్ల పోరులో విజయం సాధించింది. ఈ విజయంతో, 28 ఏళ్ల క్రెజికోవా తన కెరీర్‌లో రెండో గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. 2021లో ఆమె ఫ్రెంచ్ ఓపెన్‌ను గెలుచుకుంది.
వింబుల్డన్‌లో 31వ సీడ్‌గా ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన క్రెజికోవా, టోర్నమెంట్‌లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది. ఫైనల్‌లో, ఆమె మొదటి సెట్‌లోనే ఆధిపత్యం చెలాయించింది. రెండో సెట్‌లో ఒక చిన్న లోపం తప్ప, చివరి వరకు తన ఆటను కొనసాగించింది.
క్రెజికోవాకు ఇప్పుడు రెండు సింగిల్స్ టైటిల్స్‌తో పాటు, ఏడు డబుల్స్ మరియు మూడు మిక్స్‌డ్ డబుల్స్ ట్రోఫీలు ఉన్నాయి.
Wimbledon Prize Money: భారీగా పెరిగిన వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ ఫ్రైజ్‌మనీ.. ఎంతంటే..?