Irael Hamas War: నెట్‌జారిమ్ కారిడార్ నుంచి ఉపసంహరించుకున్న ఇజ్రాయెల్

ఈ ఒప్పందం ప్రకారం, ఇజ్రాయెల్ బలగాలు గాజా యొక్క దక్షిణ ప్రాంతం నుండి ఉత్తర గాజాకు వెళ్లే పాలస్తీనియన్లను ఏ విధమైన తనిఖీలు లేకుండా అనుమతిస్తాయి.
ఇందులోని ప్రధాన అంశాలు ఇవే..
కాల్పుల విరమణ ఒప్పందం: 42 రోజుల పాటు కొనసాగనున్న ఈ ఒప్పందం లో 22వ రోజున, గాజాలో ఉన్న జనసమ్మర్థం ఉన్న ప్రాంతాల నుండి ఇజ్రాయెల్ బలగాలు తమ బలగాలను ఉపసంహరించాలి.
హమాస్ బందీలు: హమాస్ తన వద్ద ఉన్న 33 ఇజ్రాయెలీ బందీలను విడతల వారీగా విడుదల చేయాలి.
కాల్పుల విరమణ పొడిగింపు: ఈ ఒప్పందం పొడిగింపుపై ఇరుపక్షాలు మరోసారి చర్చలు చేయాల్సి ఉంది. అయితే, చర్చలు తక్కువ స్థాయిలో జరగాలని ఇజ్రాయెల్ భావిస్తోంది.
ఖతార్: ఈ ఒప్పందంలో ఖతార్ ఒక కీలక మధ్యవర్తిగా ఉన్నది.
చర్చలకు తక్కువ స్థాయి అధికారులను ఖతార్‌కు పంపాలని, త్వరలోనే మంత్రివర్గ సమావేశం నిర్వహించి ఒప్పందంపై చర్చించాలని భావిస్తున్నారు.
Pakistan PM: పాకిస్తాన్ మాజీ ప్రధానికి 14 ఏళ్ల జైలు శిక్ష.. ఆయన భార్యకి కూడా..
ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధం:
2023 అక్టోబరులో హమాస్ చేసిన మెరుపుదాడులు తర్వాత, ఇరుపక్షాల మధ్య యుద్ధం ప్రారంభమైంది. 250 ఇజ్రాయెలీల ను బందీగా పట్టుకువచ్చిన హమాస్, అనంతరం ఇరుపక్షాలు మధ్య ఈ యుద్ధం ప్రారంభమవడానికి కారణమైంది.
☛ Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)