Skip to main content

Jyothi Yarraji: వరుసగా మూడోసారి స్వర్ణం నెగ్గిన ఆంధ్రప్రదేశ్‌ అథ్లెట్‌

జాతీయ క్రీడల్లో ఆంధ్రప్రదేశ్‌ ఖాతాలో ఐదో స్వర్ణ పతకం చేరింది.
Jyothi Yarraji Wins the Womens 100m Hurdles Gold Medal

ఫిబ్ర‌వ‌రి 9వ తేదీ జరిగిన మహిళల అథ్లెటిక్స్‌ 100 మీటర్ల హర్డిల్స్‌లో జ్యోతి యర్రాజీ పసిడి పతకాన్ని సొంతం చేసుకుంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని విశాఖపట్నం జిల్లాకు చెందిన జ్యోతి 100 మీటర్ల హర్డిల్స్‌ ఫైనల్‌ రేసును అందరికంటే వేగంగా, అందరికంటే ముందుగా 13.10 సెకన్లలో ముగించి జాతీయ క్రీడల్లో కొత్త రికార్డును నెలకొల్పింది.

జాతీయ క్రీడల్లో జ్యోతికిది వరుసగా ఇది మూడో స్వర్ణ పతకం. ఇటీవల దక్షిణ మధ్య రైల్వేలో జూనియర్‌ క్లర్క్‌గా చేరిన జ్యోతి 2022 గుజరాత్, 2023 గోవా జాతీయ క్రీడల్లోనూ పసిడి పతకాలు సాధించింది. 

మరోవైపు 10 క్రీడాంశాల సమాహారమైన డెకాథ్లాన్‌ ఈవెంట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రోహిత్‌ రోమన్‌ (6753 పాయింట్లు) కాంస్య పతకాన్ని సాధించాడు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ 12 పతకాలతో (5 స్వర్ణాలు, 1 రజతం, 6 కాంస్యాలు) 18వ స్థానంలో ఉంది.

Karnataka Swimmers: జాతీయ క్రీడల్లో కర్ణాటక స్విమ్మర్లకు.. చెరో తొమ్మిది పసిడి పతకాలు

Published date : 10 Feb 2025 01:13PM

Photo Stories