Skip to main content

AP Pension Kanuka: ఆంధ్రప్రదేశ్‌లో ఫించన్‌ పథకం పేరు మార్పు..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫించన్‌ పథకం పేరును మార్చింది.
NTR Guarantee Scheme   AP New Govt: CM Chandrababu Renamed YSR Pension Kanuka    AP Government Official Announcing Scheme Change

ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నారా చంద్రబాబు నాయుడు ఫించన్‌ పథకం పేరును ఎన్టీఆర్‌ భరోసాగా పెట్టారు. 

రాష్ట్రంలోని 65.39 లక్షల మంది పింఛన్ దారులకు నగదు పెంపుతో నెలకు రూ.2,758 కోట్లు, ఏడాదికి రూ.33,099 కోట్లు ఖర్చవుతుందని ప్రభుత్వం ఇప్పటికే అంచనా వేసింది.

రాష్ట్రంలో ప్రస్తుతం వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, చేనేత కార్మికులు, కల్లు గీత కార్మికులు, మత్స్యకారులు, చర్మకారులు, డప్పు కళాకారులు, హిజ్రాలు, హెచ్ ఐవీ బాధితులు, కళాకారులకు ప్రతీనెల రూ.3 వేలు పింఛన్ అందుతుంది. సీఎంగా చంద్రబాబు ఆ పింఛన్‌ను రూ.4వేలకు పెంచుతూ సంతకం చేశారు. 

AP Cabinet Ministers: ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన‌ చంద్రబాబు.. మంత్రులు వీరే..!

దీంతో ఏప్రిల్ నుంచే పెంపును అమలు చేయనుండటంతో జులై 1న పింఛన్ కింద వీరికి రూ.7 వేలు (జులై1న ఇచ్చే రూ.4 వేలు, ఏప్రిల్ నుంచి మూడు నెలలకు రూ.వెయ్యి చొప్పున) అందివ్వనున్నారు.
 
అలాగే.. దివ్యాంగులకు ప్రస్తుతం రూ.3 వేలు అందుతుంది.. జులై నెల నుంచి వారికి రూ.6 వేలు అందివ్వనున్నారు.

Published date : 14 Jun 2024 12:19PM

Photo Stories