Global Capability Centers: హైదరాబాద్‌లో.. ‘ఆమ్‌జెన్’ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్

అమెరికాలోని దక్షిణ కాలిఫోర్నియాకు చెందిన ‘ఆమ్‌జెన్’ హైదరాబాద్‌లోని హైటెక్ సిటీ ప్రాంతంలో తన కార్యకలాపాలను ప్రారంభించింది.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం(ఫిబ్రవరి 24వ తేదీ) ఈ కేంద్రాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. జీవశాస్త్ర రంగం, బయోటెక్నాలజీ, ఫారా, డేటాసైన్స్, కృత్రిమ మేథ రంగాల్లో వేగంగా అభివృద్ధి చెందుతోందని, ఆమ్‌జెన్ లాంటి కంపెనీలు ఇక్కడ తమ జీసీసీలను ఏర్పాటు చేయడం ఎంతైనా ఆహ్వానించదగ్గ పరిణామమని అన్నారు.
Startup Companies: స్టార్టప్‌లకు తెలంగాణ ప్రభుత్వం.. ఆ దేశంతో కీలక ఒప్పందం
200 మిలియన్ డాలర్ల పెట్టుబడి..
ఆమ్‌జెన్ హైదరాబాద్ జీసీసీ కోసం 200 మిలియన్ డాలర్ల పెట్టుబడి పెడుతున్నామని.. రానున్న రోజుల్లో ఈ మొత్తం మరింత పెరుగుతుందని కంపెనీ ఛైర్మన్, సీఈవో రాబర్ట్ బ్రాడ్‌వే తెలిపారు. ప్రస్తుతం ఈ కేంద్రంలో 300 మంది పని చేస్తూండగా.. మరో 300 మంది చేరబోతున్నారని, ఈ ఏడాది చివరికల్లా ఉద్యోగుల సంఖ్య రెండు వేలకుపైబడి ఉంటుందని ఆయన వివరించారు. 1980లో దక్షిణ కాలిఫోర్నియాలో ప్రారంభమైన ఆమ్‌జెన్ ప్రస్తుతం వంద దేశాలకు విస్తరించింది, మొత్తం 28 వేల మంది ఇందులో పని చేస్తున్నారని రాబర్ట్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ఆమ్‌జెన్ సీఈవో రాబర్ట్ బ్రాడ్‌వే, ఆమ్‌జెన్ ఇండియా ఉన్నతాధికారి నవీన్ గుళ్లపల్లి తదితరులు పాల్గొన్నారు.