Skip to main content

Tirupati Airport: తిరుపతి విమానాశ్రయంలో రన్‌వే.. రాష్ట్రంలోనే అతిపెద్దది ఇదే..

తిరుపతి రేణిగుంట విమానాశ్రయంలో అంతర్జాతీయ విమానాలు ల్యాండ్‌ అయ్యేందుకు వీలుగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోనే అతిపెద్ద రన్‌వే అందుబాటులోకి వచ్చింది.
Tirupati Airport runway is expanded to 3,810 mts

ప్రస్తుతం రేణిగుంట ఎయిర్ పోర్టులో అందుబాటులో ఉన్న 2,285 మీటర్ల రన్‌వేను రూ.156.16 కోట్లు వెచ్చించి 3,810 మీటర్లకు విస్తరించారు.  ఈ రన్‌వేను విస్తరించడంతో విశాఖపట్నం, విజయవాడ విమానాశ్రయాల కన్నా ఇది అతి పెద్ద రన్‌వే ఏర్పడింది. 

అలాగే విమానాలు టర్న్ తీసుకునే ప్రాంతాన్ని కూడా 700 మీటర్ల నుంచి 1500 మీటర్లకు పెంచారు. దీంతో పెద్ద విమానాలు సులువుగా మలుపు తిరగవచ్చు. ఇక్కడికి అంతర్జాతీయ విమాన సర్వీసులు నడిపేందుకు చర్చలు జరుగుతుంది.

కాగా.. రన్‌వేపై లైటింగ్‌ పనులు కారణంగా ఫిబ్ర‌వ‌రి 21వ తేదీ మధ్యాహ్నం 2.30 నుంచి 22వ తేదీ(శనివారం) ఉదయం 5 గంటల వరకూ విమాన సర్వీసులను రద్దు చేస్తారు.

South Coast Railway Zone: విశాఖ కేంద్రంగా సౌత్‌ కోస్ట్‌ రైల్వ్ జోన్‌కు కేబినెట్‌ ఆమోదం

Published date : 22 Feb 2025 10:53AM

Photo Stories