Wimbledon 2024: వరుసగా రెండో ఏడాది వింబుల్డన్ సింగిల్స్ టైటిల్‌ను సొంతం చేసుకున్న అల్కరాజ్.. ప్రైజ్ మనీ ఎంతో తెలుసా..
జూలై 14వ తేదీ జరిగిన ఫైనల్లో, మూడో సీడ్ అల్కరాజ్ 2 గంటల 27 నిమిషాల పోరులో రెండో సీడ్, 24-గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్ విజేత నోవాక్ జోకోవిచ్ (సెర్బియా)పై 6-2, 6-2, 7-6 (7/4)తో ఘన విజయం సాధించాడు.
అల్‌కరాజ్ కెరీర్‌లో ఇది నాలుగో గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్. అతను 2022లో యూఎస్ ఓపెన్, 2023లో వింబుల్డన్, 2024లో ఫ్రెంచ్, వింబుల్డన్ టోర్నీలను సాధించాడు. ఈ గెలుపుతో, అల్కరాజ్ ప్రపంచ ర్యాంకింగ్‌లో మొదటి స్థానానికి చేరుకోవడానికి మరింత దగ్గరగా వచ్చాడు. 27 ఏళ్ల జోకోవిచ్, ఈ ఓటమితో ర్యాంకింగ్స్‌లో మూడో స్థానానికి పడిపోయాడు.
అల్కరాజ్‌కు భారీ ప్రైజ్ మనీ: ఈ విజయంతో అల్కరాజ్‌కు 27 లక్షల పౌండ్ల (రూ. 29 కోట్ల 23 లక్షలు) భారీ ప్రైజ్ మనీ లభించింది. రన్నరప్ జోకోవిచ్‌కు 14 లక్షల పౌండ్ల (రూ. 15 కోట్ల 15 లక్షలు) లభించాయి.
6 ఓపెన్ శకంలో ఒకే ఏడాది ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్ టోర్నీ టైటిల్స్ సాధించిన ఆరో ప్లేయర్ అల్‌కరాజ్. గతంలో రాడ్ లేవర్ (ఆ్రస్టేలియా; 1969లో), జాన్ బోర్గ్ (స్వీడన్; 1978, 1979, 1980లలో), రాఫెల్ నాదల్ (స్పెయిన్; 2008, 2010లలో), ఫెడరర్ (స్విట్జర్లాండ్; 2009లో), జొకోవిచ్ (సెర్బియా; 2021లో) ఈ ఘనత సాధించారు.
Tags
- Wimbledon 2024 final
- Carlos Alcaraz
- Novak Djokovic
- Wimbledon 2024
- Wimbledon final
- Wimbledon
- Wimbledon men's singles title
- Sakshi Education Updates
- latest sports news
- CarlosAlcaraz
- Wimbledon2024
- TennisChampion
- NovakDjokovic
- GrandSlamWinner
- sportsnews in telugu
- sakshieducationlatest sports news in telugu