Mahakumbh Mela: కుంభమేళాలో పాల్గొననున్న ప్రముఖులు, రాజకీయ నేతలు వీరే.. 5న మోదీ పుణ్యస్నానం

జనవరి 13న మొదలైన కుంభమేళా ఫిబ్రవరి 26వ తేదీ వరకు కొనసాగనుంది. అప్పటివరకు అనేక ప్రముఖులు, రాజకీయ నేతలు కూడా ఈ పవిత్ర మేళాలో పాల్గొననున్నారు.
➤ ఫిబ్రవరి 5వ తేదీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ త్రివేణి సంగమం వద్ద పుణ్యస్నానం చేస్తారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ సందర్భంగా ఆయన భక్తులతో కలిసి దైవిక ఆశీర్వాదాలను పొందేందుకు ప్రత్యేకంగా పాల్గొంటారు.
➤ జనవరి 27వ తేదీ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా త్రివేణి సంగమం వద్ద పవిత్ర స్నానం చేస్తారు. అలాగే, గంగా హారతి కార్యక్రమంలోనూ పాల్గొని, భద్రతను సమీక్షిస్తారు.
➤ ఫిబ్రవరి 1వ తేదీ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ ప్రయాగ్‌రాజ్‌లో పుణ్య స్నానం చేస్తారు.
➤ ఫిబ్రవరి 10వ తేదీ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రయాగ్‌రాజ్‌కి రానున్నారు. వారు పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు.
కుంభమేళా పర్వాలు..
మౌని అమావాస్య(రెండో షాహీ స్నానం): జనవరి 29న రెండో షాహీ స్నానం జరుగనుంది. ఈ రోజు విశేషంగా భక్తులు గంగానదిలో స్నానం చేస్తారు.
వసంత పంచమి: ఫిబ్రవరి 3వ తేదీన మూడో షాహీ స్నానం జరుగనుంది.
మాఘ పూర్ణిమ: ఫిబ్రవరి 12న మాఘ పూర్ణిమ సందర్భంగా మరింత భక్తుల ప్రవాహం ఉంటుందని అంచనా.
మహాశివరాత్రి: ఫిబ్రవరి 26న, మహాశివరాత్రి రోజున కుంభమేళా ముగుస్తుంది.
భక్తుల సంఖ్య: జనవరి 20 నాటికి, 8.81 కోట్ల మందికిపైగా భక్తులు పుణ్య స్నానాలు చేసినట్లు ఉత్తరప్రదేశ్ రాష్ట్ర గణాంకాలు తెలిపాయి.
భద్రతా చర్యలు: భద్రత క్రమంలో ప్రధాన కూడళ్ల వద్ద సెక్యూరిటీ తనిఖీలను మరింత కఠినతరం చేశారు. ప్రభుత్వ అధికారులు భద్రతా అంశాలను సమీక్షిస్తూ, కుంభమేళా ప్రాంగణంలో భక్తుల రక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు.