KP Sharma Oli: నేపాల్ నూతన ప్రధానిగా కేపీ శర్మ ఓలి
జులై 14వ తేదీ అధ్యక్షుడు రాం చంద్ర పౌడెల్ ఆయన్ను ప్రధానిగా నియమించారు. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్–యూనిఫైడ్ మార్క్సిస్ట్ లెనినిస్ట్ (సీపీఎన్–యూఎంఎల్)–నేపాలీ కాంగ్రెస్(ఎన్‌సీ)లతో కొత్తగా ఏర్పాటైన సంకీర్ణ ప్రభుత్వానికి చైనా అనుకూలవాదిగా పేరున్న ఓలి నాయకత్వం వహించనున్నారు. పార్లమెంట్‌లో జులై 12వ తేదీ జరిగిన విశ్వాస పరీక్షలో పుష్ప కమల్ దహల్ ప్రచండ ఓడిపోవడంతో కొత్త ప్రభుత్వం ఏర్పాటు అనివార్యమైంది.
గతంలో నేపాల్ ప్రధానిగా కేపీ శర్మ ఓలి 2015–16, 2018–2021 సంవత్సరాల మధ్యలో పనిచేశారు. అయితే, అప్పటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో 2021 మే 13వ తేదీన మరోసారి ఓలిని రాష్ట్రపతి బిద్యాదేవి భండారీ ప్రధానిగా నియమించారు. ఈ నియమాకం రాజ్యాంగ విరుద్ధమంటూ సుప్రీంకోర్టు తీర్పు వెలువరించడంతో ఓలి అప్పట్లో రాజీనామా చేయాల్సి వచ్చింది. తాజాగా ఏర్పడిన సంకీర్ణంలో మరో ఐదు పార్టీలు చేరే అవకాశాలున్నాయంటున్నారు.
Masoud Pezeshkian: ఇరాన్ నూతన అధ్యక్షుడిగా మసూద్ పెజెష్కియాన్
Tags
- KP Sharma Oli
- Nepal Prime Minister
- Nepal New PM
- New PM of Nepal
- Communist Leader
- CPI-UML
- President Ram Chandra Paudel
- Sweden’s new Prime Minister
- Sakshi Education Updates
- International news
- current affairs in telugu
- Khadga Prasad Sharma Oli news
- Nepal Prime Minister appointment
- CPN–UML coalition government
- Nepali politics update
- Pro-China leader Nepal