ANM Course:ఏఎన్‌ఎం శిక్షణకు దరఖాస్తుల స్వీకరణ
Sakshi Education
ఖమ్మం: ఖమ్మంలోని మహిళా ప్రాంగణంలో ఏఎన్‌ఎం శిక్షణకు ఆసక్తి ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రాంగణం మేనేజర్ వేల్పుల విజేత తెలిపారు. ఇంటర్‌లో ఏ గ్రూప్ అయినా పూర్తి చేసి, 17ఏళ్లు నిండిన ఉమ్మడి జిల్లాలోని మహిళలు ఈనెల 25వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఎస్సెస్సీ మెమో, 4నుండి 10వ తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్లు, ఆధార్, కుల ధృవీకరణ పత్రం, రెండు ఫొటోలతో పాటు ‘కమిషనర్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, తెలంగాణ, హైదరాబాద్’ పేరిట తీసిన రూ.200 డీడీతో మహిళా ప్రాంగణానికి వస్తే ఆన్‌లైన్ చేస్తామని తెలిపారు.
ఇదీ చదవండి: నేడు ఎనిమిది మెడికల్ కళాశాలలు ఏర్పాటు ... నేటి నుంచి తరగతులు
Published date : 24 Oct 2024 12:55PM