Skip to main content

IISC Admission Notification 2025 : ఐఐఎస్‌సీలో బీటెక్ ప్ర‌వేశాలు.. ద‌ర‌ఖాస్తుల వివ‌రాలు..

బెంగ‌ళూరులో ఐఐఎస్‌సీ.. ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌లో అడ్మిష‌న్‌ల కోసం నోటిఫికేష‌న్‌ను విడుద‌ల చేశారు అధికారులు.
B Tech admissions at iisc banglore releases notification

సాక్షి ఎడ్యుకేష‌న్: బెంగ‌ళూరులో ఐఐఎస్‌సీ.. ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌లో అడ్మిష‌న్‌ల కోసం నోటిఫికేష‌న్‌ను విడుద‌ల చేశారు అధికారులు. నూత‌న విద్యాసంవ‌త్స‌రం 2025-26కు సంబంధించి, బీటెక్‌లో మ్యాథ్స్‌, కంప్యూటింగ్ ప్రోగ్రామ్ వంటి సబ్జెక్టుల్లో ప్ర‌వేశాలు పొందేందుకు అర్హ‌త‌, ఆస‌క్తి ఉన్న విద్యార్థుల నుంచి ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తున్నారు. ఈ మెర‌కు నోటిఫికేష‌న్‌లో పేర్కొన్న వివ‌రాల‌ను ఒక‌సారి ప‌రిశీలించండి..

కోర్సు వివ‌రాలు: మ్యాథ్స్ అండ్‌ కంప్యూటింగ్ ప్రోగ్రామ్‌లో బీ.టెక్

అర్హ‌త‌లు: గణితం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం ప్రధాన సబ్జెక్టులుగా ప‌ది, ఇంట‌ర్‌ లేదా తత్సమాన పరీక్షను పూర్తి చేసి ఉండాలి.

OU PhD Entrance Exam: OU పీహెచ్‌డీ ప్రవేశపరీక్షకు దరఖాస్తుల ఆహ్వానం.. చివరి తేది ఇదే

ఎంపిక విధానం: ఐఐఎస్‌సీ లేదా జేఈఈ మెయిన్స్, అడ్వాన్స‌డ్‌, కేవీపీవై లేదా నీట్ వంటి జాతీయ స్థాయి ప‌రీక్ష‌ల్లో విద్యార్థులు సాధించే మార్కుల ఆధారంగా ఎంపిక ప్ర‌క్రియ ఉంటుంది.

ద‌ర‌ఖాస్తుల విధానం: ఆన్‌లైన్‌లో.. ఐఐఎస్‌సీ అడ్మిష‌న్ పోర్ట‌ల్‌లో ఉన్న అప్లికేష‌న్ పార్మ్‌లో కావాల్సిన‌ వివ‌రాల‌ను న‌మోదు చేసి ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

Model Schools Admissions 2025 : మోడ‌ల్ స్కూళ్ల‌లో ప్ర‌వేశాలు.. ద‌ర‌ఖాస్తుల‌కు తేదీ పొడ‌గింపు..

ఫీజు వివ‌రాలు: జ‌న‌ర‌ల్/ఓబీసీ/ఈడ‌బ్యూఎస్- రూ.500
                          ఎస్‌సీ/ఎస్‌టీ/పీడబ్యూడీ- రూ.250

ఫీజు చెల్లింపు.. నెట్ బ్యాంకింగ్‌, డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు అండ్ యూపీఐ వంటి ఆన్‌లైన్ విధానంలో చేయాల్సి ఉంటుంది.

ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రి తేదీ: మార్చి 6, 2025

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

Published date : 25 Feb 2025 03:18PM
PDF

Photo Stories