AFCAT 2025 Hall Tickets Download : ఏఎఫ్‌సీఏటీ 2025 హాల్‌టికెట్ విడుదల.. డౌన్‌లోడ్ విధానం.. ప్రిపరేషన్‌లో ఇవి పాటించండి..

సాక్షి ఎడ్యుకేషన్: భారత వైమానిక దళం ఏఎఫ్‌సీఏటీ 2025 పరీక్షకు సంబంధించి హాల్‌టికెట్లను విడుదల చేశారు. ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్ (ఏఎఫ్‌సీఏటీ) పరీక్ష రాసే అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ afcat.cdac.in. నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు. ఈ నేపథ్యంలో డౌన్‌లోడ్ విధానం, పరీక్షకు ప్రిపరేషన్ విధానాన్ని ఒక్కసారి పరిశీలిద్దాం..
ఏఎఫ్‌సీఏటీ 2025 హాల్‌టికెట్ డౌన్‌లోడ్ విధానం:
➺ అధికారిక వెబ్‌సైట్‌ను afcat.cdac.in. సందర్శించండి.
➺ హోమ్ పేజీలో కనిపిస్తున్న "AFCAT 01/2025 Admit Cardష లింక్‌పై క్లిక్ చేయండి.
➺ మీ ఈమెయిల్ ఐడీ, పాస్‌వర్డ్‌ను నమోదు చేయండి.
Fresher Jobs: 10th Class అర్హతతో 100 ఉద్యోగాలు.. దరఖాస్తుకు నేడే చివరి తేదీ!
➺ అక్కడ కనిపిస్తున్న security captcha ను నమోదు చేయండి.
➺ ఇక సబ్మిట్ బటన్‌ను క్లిక్ చేసి, మీ హాల్‌టికెట్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి, వెంటనే ప్రింట్ కూడా తీసుకోండి. ఆ ప్రింట్‌ను పరీక్ష కేంద్రానికి తప్పనిసరిగా తీసుకెళ్ళాలి.
పరీక్షకు ప్రిపేర్ అయ్యే విధానం:
➼ సిలబస్ పరిశీలన: ఏఎఫ్‌సీఏటీ పరీక్షలో ఉండే సిలబస్‌ను పూర్తిగా పరిశీలించండి. ప్రతి విభాగంలో కవర్ చేయాల్సిన అంశాలను తెలుసుకోండి.
➼ కరెంట్ అఫైర్స్: ప్రతీ రోజు వార్తలను చదువుతూ ఉండాలి. ప్రతీ విషయాన్ని తెలుసుకోవాలి. రోజూ న్యూస్ పేపర్ చదవడం, వార్తలు వినడం, మ్యాగజైన్‌లు చదవడం చాలా ముఖ్యం. జాతీయ, అంతర్జాతీయ వార్తను తెలుసుకుంటూ ఉండాలి.
IAF Jobs: Intermediate అర్హతతో భారత వాయుసేనలో అగ్నివీర్ వాయు ఉద్యోగాలు
➼ గత ప్రశ్నపత్రాలు: ఏఎఫ్‌సీఏటీ పరీక్షకు సిద్ధమయ్యే సమయంలో అభ్యర్థులు గతంలోని ప్రశ్నపత్రాలను కూడా పరిశీలించాలి. వాటిలోని ప్రశ్నలను కూడా ప్రాక్టీస్ చేయాలి. దీంతో, పరీక్షకు ఎలాంటి ప్రశ్నలు వస్తాయి, మీరు ఎందులో మరింత ప్రిపేర్ అవ్వాలి అనే అంశాలపై క్లారిటీ వస్తుంది.
➼ మాక్ టెస్ట్‌లు: పరీక్షకు సిద్ధమయ్యే సమయంలో అభ్యర్థులు, మాక్ టెస్ట్‌లు తీసుకోవడం చాలా ముఖ్యమైనది. దీంతో, పరీక్ష రాసేటప్పుడు ఎంత సమయాన్ని కేటాయిస్తున్నారు, ఎందులో మరింత ప్రిపరేషన్ అవసరం, అనే విషయాలు తెలుస్తాయి. అంతేకాకుండా, ఎంత స్పీడ్‌గా మీరు ప్రతీ ప్రశ్నను పూర్తి చేస్తున్నారనే విషయంపై కూడా స్పష్టత వస్తుంది.
➼ సాధారణ అవగాహన: చరిత్ర, భౌగోళిక శాస్త్రం, విజ్ఞాన శాస్త్రంతో సహా సాధారణ జ్ఞానంలో బలమైన పునాదిని నిర్మించడంపై దృష్టి పెట్టండి.
Pre Primary School : ఇకపై సర్కార్ బడుల్లో ప్రీ ప్రైమరీ.. విద్యాశాఖ కసరత్తు..
➼ మాస్టర్ న్యూమరికల్ ఎబిలిటీ అండ్ రీజనింగ్: మీ సమస్య పరిష్కార నైపుణ్యాలను మెరుగుపరచడానికి క్వాన్టిటేటివ్ అండ్ లాజికల్ రీజనింగ్ ప్రశ్నలను ప్రాక్టీస్ చేయండి.
➼ బలమైన పదజాలం: వ్యాకరణం, పదజాలం, గ్రహణశక్తితో సహా మీ ఆంగ్ల భాషా నైపుణ్యాలను మెరుగుపరచడానికి పని చేయండి. వివిధ పుస్తకాలు, లేదా ఇంగ్లీష్ న్యూస్ పేపర్‌లను చదవండి.
➼ సానుకూలంగా ఉండండి: పరీక్షల సమయంలో అభ్యర్థులు ఎక్కవ శాతం భయాందోళనకు గురవుతారు. పరీక్ష దగ్గరపడుతున్న సమయంలో మరింత ఒత్తిడికి గురవుతారు. కాబట్టి, ప్రతీ ఒక్కరు.. సానుకూల మనస్తత్వాన్ని కలిగి ఉండండి, తగినంత విశ్రాంతి తీసుకోవడం, ఉదయాన్నే వ్యాయామం చేయడం, నాణ్యమైన ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, ఒత్తిడిని నిర్వహించండి.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
Tags
- Admissions 2025
- AFCAT 2025
- hall ticket download for afcat entrance exam
- airforce common entrance exam 2025
- exam and preparation details
- preparation tips for afcat exam 2025
- afcat 1/2025
- hall ticket download
- direct link for afcat 2025 admit card download
- Indian Air Force
- indian air force job notification
- Education News
- Sakshi Education News
- air force admissions notifications
- latest news on air force exam
- latest news and updates on afcat 2025