Wonder Kid: మిజోరాం ‘వండర్ కిడ్’కు గిటార్ బహుమతి
Sakshi Education
‘మా తుఝే సలాం’ పాటతో శ్రోతలను మంత్రముగ్ధులను చేసిన మిజోరాం ‘వండర్ కిడ్’ ఎస్తేర్ లాల్దుహామి హ్నామ్టేకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా గిటార్ బహుమతిగా ఇచ్చారు.

2021లో ఆమె పాడిన ‘మా తుఝే సలాం’ పాట వైరలై దేశమంతటి దృష్టినీ ఆకర్షించింది. ఈశాన్య రాష్ట్రాల పర్యటనలో ఉన్న అమిత్ షా ఆదివారం ఐజ్వాల్‌లో ఆమెను రాజ్‌భవన్‌కు ఆహ్వనించారు. తనకు గిటార్ అందజేసిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇదొక మైమరపించే అనుభవంగా ఆయన అభివర్ణించారు.
దక్షిణ మిజోరంలోని లుంగ్లీ పట్టణానికి చెందిన హ్నామ్టే 2016 జూన్ 9న జన్మించింది. మూడేళ్ల వయసులోనే పాడటం ప్రారంభించింది. ఆమె ‘మా తుఝే సలాం’ మ్యూజిక్ వీడియోను యూట్యూబ్‌లో వారం రోజుల్లోనే 30 లక్షల మంది చూశారు. ఈ సంఖ్య ప్రస్తుతం 4.7 కోట్లకు చేరింది. ఆమె జీవితంపై తీసిన ‘ఎ స్టార్ ఈజ్ బోర్న్’కు 2023లో ఈశాన్య చలన చిత్రోత్సవంలో ఉత్తమ డాక్యుమెంటరీ అవార్డు వచ్చింది.
Memory League World Championship: సూపర్.. మెమొరీ లీగ్ వరల్డ్ ఛాంపియన్‌గా భారతీయ విద్యార్థి
Published date : 17 Mar 2025 04:11PM