Skip to main content

Hockey India Awards 2024: సవిత, హర్మన్‌ప్రీత్‌కు హాకీ ఇండియా అవార్డులు

భారత పురుషుల హాకీ జట్టు కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ సింగ్, మహిళల జట్టు సీనియర్‌ గోల్‌కీపర్‌ సవిత పునియాకు హాకీ ఇండియా ఉత్తమ ప్లేయర్‌ (2024) అవార్డులు దక్కాయి.
Harmanpreet Singh, Savita Punia Win Hockey India Player of the Year Awards

అంతర్జాతీయ స్థాయిలో నిలకడైన ప్రదర్శనతో జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న భారత పురుషుల హాకీ జట్టు కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ సింగ్, మహిళల జట్టు గోల్‌కీపర్‌ సవితా పూనియాకు.. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద ఇయర్‌’ అవార్డులు దక్కాయి. హాకీ దిగ్గజం బల్బీర్‌ సింగ్‌ పేరిట ప్రతి ఏడాది ఉత్తమ ప్రదర్శన కనబర్చిన ప్లేయర్లకు హాకీ ఇండియా (హెచ్‌ఐ) ఈ పురస్కారాలు అందజేస్తోంది.

2024 పారిస్‌ ఒలింపిక్స్‌లో హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ సారథ్యంలో భారత జట్టు వరుసగా రెండో సారి విశ్వ క్రీడల్లో కాంస్య పతకం సాధించింది. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యం నెగ్గిన జట్టులోనూ హర్మన్‌ప్రీత్‌ సభ్యుడు. 

ICC Awards: నాలుగు ఐసీసీ అవార్డులు అందుకున్న బుమ్రా..!

ఇక టోక్యో ఒలింపిక్స్‌లో భారత జట్టు నాలుగో స్థానంలో నిలవడంలో సవిత ప్రధాన పాత్ర పోషించింది. 2024 సంవత్సరానికి గానూ సవిత హాకీ ఇండియా బల్జీత్‌ సింగ్‌ ‘గోల్‌కీపర్‌ ఆఫ్‌ ద ఇయర్‌’ అవార్డు కూడా దక్కించుకుంది.

భారత పురుషుల హాకీ జట్టు 1975లో ప్రపంచకప్‌ నెగ్గి 50 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా హాకీ ఇండియా ప్రతిష్టాత్మకంగా వేడుకలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగానే ప్లేయర్లకు పురస్కారాలు అందజేసింది. 

Lifetime Achievement Award: మెగాస్టార్ చిరంజీవికి అంతర్జాతీయ స్థాయిలో అరుదైన గౌరవం..!

Published date : 17 Mar 2025 03:11PM

Photo Stories