IAF Jobs: Intermediate అర్హతతో భారత వాయుసేనలో అగ్నివీర్ వాయు ఉద్యోగాలు

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన భారత వాయుసేన అగ్నిపథ్ స్కీంలో భాగంగా క్రీడల విభాగంలో అగ్నివీర్ వాయు నియామకాలకు సంబంధించి నోటిషికేషన్ విడుదల చేశారు. అగ్నివీర్ వాయు (స్పోర్ట్స్) (02/ 2025) ఖాళీల భర్తీకి ఐఏఎఫ్ ఆన్‌లైన్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అర్హులైన అవివాహిత పురుష అభ్యర్థులు ఫిబ్రవరి 22వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఇందులో భారత వాయుసేన- అగ్నివీర్ వాయు (స్పోర్ట్స్) ఇన్ టేక్2/2025 ఉద్యోగాలు ఉన్నాయి.
క్రీడాంశాలు: అథ్లెటిక్స్, బాక్సింగ్, క్రికెట్, సైక్లింగ్, లాన్ టెన్నిస్, హ్యాండ్‌బాల్, స్విమ్మింగ్/ డైవింగ్, షూటింగ్, వాటర్ పోలో, రెజ్లింగ్, బాస్కెట్‌బాల్, సైకిల్ పోలో, ఫుట్‌బాల్, జిమ్నాస్టిక్స్, హాకీ, స్క్వాష్, కబడ్డీ, వాలీబాల్, వెయిట్ లిఫ్టింగ్, ఉషు క్రీడల్లో యువత రాణించి ఉండాలి.
అర్హత: కనీసం 50% మార్కులతో ఇంటర్మీడియట్/ 10+2 (మ్యాథ్స్, ఫిజిక్స్, ఇంగ్లిష్) లేదా ఏదైనా స్ట్రీమ్/ సబ్జెక్టుల్లో ఇంటర్మీడియట్/ 10+2/ తత్సమాన పరీక్ష ఉత్తీర్ణత. లేదా ఇంజినీరింగ్‌లో డిప్లొమా కోర్సు (మెకానికల్/ ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్స్/ ఆటోమొబైల్/ కంప్యూటర్ సైన్స్/ ఇన్‌స్ట్రుమెంటేషన్ టెక్నాలజీ/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ). నిర్దిష్ట శారీరక దారుఢ్య/ వైద్య ప్రమాణాలతో పాటు స్పోర్ట్స్ అచీవ్‌మెంట్స్ తప్పనిసరి.
ఎత్తు: 152 సెం.మీ. కనీస ఎత్తు ఉండాలి.
వయోపరిమితి: 03-07-2004 నుంచి 03-01-2008 మధ్య జన్మించిన అభ్యర్థులు అర్హులు.
ఎంపిక ప్రక్రియ: సెలెక్షన్ టెస్ట్, స్పోర్ట్స్ స్కిల్ ట్రయల్స్, ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
రిజిస్ట్రేషన్ ఫీజు: రూ.100.
ముఖ్య తేదీలు..
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: 13-02-2025.
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చివరి తేదీ: 22-02-2025.
రిక్రూట్‌మెంట్ ట్రయల్స్ షెడ్యూల్: 10 నుంచి 12-03-2025 వరకు.
వెబ్‌సైట్: https://agnipathvayu.cdac.in/AV/
![]() ![]() |
![]() ![]() |
Tags
- Indian Air Force
- IAF Jobs
- Air Force Agniveer Vayu Recruitment 2025
- Agnipath
- Indian Air Force Agniveer Vayu Recruitment 2025 Out
- Indian Air Force Agniveer Salary
- Indian Airforce Agniveer Vayu Intake 02/2025
- Agniveer air jobs in indian air force salary
- Air Force Agniveer Apply Online
- Join Indian Air Force
- Indian Air Force Recruitment
- agniveer vayu intake 02/2025
- Agniveer Vayu
- Jobs
- latest jobs