10th Class అర్హతతో భారత సైన్యంలో పలు ఉద్యోగాలు.. ఎంపిక విధానం ఇలా!
Sakshi Education
భారత సైన్యం అగ్నివీర్ రిక్రూట్మెంట్ 2025 పలు ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. భారత సైన్యం అగ్నిపథ్ స్కీమ్ కింద అగ్నివీర్ నియామకాల కోసం అధికారిక నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. అర్హత కలిగిన అభ్యర్థులు ఏప్రిల్ 10, 2025 వరకు అగ్నివీర్ ర్యాలీకి దరఖాస్తు చేసుకోవచ్చు.

పోస్టుల వివరాలు:
- అగ్నివీర్ జనరల్ డ్యూటీ
- అగ్నివీర్ టెక్నికల్
- అగ్నివీర్ క్లర్క్/స్టోర్ కీపర్ టెక్నికల్
- అగ్నివీర్ ట్రేడ్స్‌మాన్
విద్యార్హతలు:
- మెట్రిక్యులేషన్/10వ తరగతి ఉత్తీర్ణత & సంబంధిత పని అనుభవం
- అగ్నివీర్ జనరల్ డ్యూటీ (GD) - కనీసం 10వ తరగతి ఉత్తీర్ణత
- ట్రేడ్స్‌మెన్ పోస్టులు - కనీసం 8వ తరగతి ఉత్తీర్ణత
వయసు:
- కనీసం 17 సంవత్సరాలు
- గరిష్టంగా 21 సంవత్సరాలు
దరఖాస్తు ప్రక్రియ:
- అధికారిక వెబ్‌సైట్ (joinindianarmy.nic.in) కు వెళ్లండి.
- క్రిందికి స్క్రోల్ చేసి ‘Agniveer Apply/Login’ లింక్‌ను క్లిక్ చేయండి.
- కొత్త యూజర్ అయితే రిజిస్టర్ చేసుకోండి, లేదంటే మీ యూజర్‌నేమ్, పాస్‌వర్డ్‌తో లాగిన్ అవ్వండి.
- అవసరమైన అన్ని వివరాలను నమోదు చేసి, ఫీజు చెల్లించి, దరఖాస్తును సమర్పించండి.
- పూర్తయిన ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసి, ప్రింట్ తీసుకోండి.
ఎంపిక విధానం:
- రాత పరీక్ష & శారీరక పరీక్ష
- రాత పరీక్ష జూన్‌లో నిర్వహించనున్నారు.
- రాత పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు శారీరక పరీక్షలకు హాజరుకావాల్సి ఉంటుంది.
దరఖాస్తు వివరాలు:
- ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభతేది: 12.03.2025
- దరఖాస్తు చివరితేది: 10.04.2025
అధికారిక వెబ్‌సైట్: joinindianarmy.nic.in
![]() ![]() |
![]() ![]() |
Published date : 15 Mar 2025 06:29PM
Tags
- Indian Army Agniveer Recruitment 2025
- Agniveer Notification 2025 Telugu
- Indian Army Jobs 2025 Secunderabad
- Agniveer Recruitment 2025 Apply Online
- Indian Army Vacancy 2025
- Agnipath Scheme Recruitment 2025
- Agniveer Selection Process 2025
- Agniveer Eligibility Criteria 2025
- Indian Army Physical Test 2025
- Indian Army Written Exam 2025
- Agniveer Bharti 2025
- Army Agniveer Jobs 2025 in Telangana
- Join Indian Army 2025 Online Application