Pre Primary School : ఇకపై సర్కార్ బడుల్లో ప్రీ ప్రైమరీ.. విద్యాశాఖ కసరత్తు..

నారాయణఖేడ్: సర్కారు బడులను మరింత బలోపేతం చేయడంపై ప్రభుత్వం దృష్టి సారిస్తోంది. ఇందులో భాగంగా ప్రభుత్వ బడుల్లో ప్రీ ప్రైమరీ తరగతులను ప్రారంభించేందుకు కసరత్తులు చేస్తుంది సర్కార్. బడికి దూరంగా ఉంటున్న వేలాదిమంది చిన్నారులను బడుల్లో చేర్పించడంతోపాటు, ప్రాథమిక స్థాయిలోనే సర్కారు బడులవైపు విద్యార్థులు మళ్లేలా పాఠశాల విద్యాశాఖ చర్యలకు ఉపక్రమించింది.
NEET UG 2025 FAQs: నీట్ పరీక్షలో అభ్యర్థుల సాధారణ ప్రశ్నలు, ముఖ్య వివరాలు, పరీక్ష విధానం
అందులో భాగంగా వచ్చే విద్యా సంవత్సరం 2025-26 నుంచి ప్రీ ప్రైమరీ క్లాసులను కూడా ప్రారంభించేందుకు యోచిస్తుంది. ఇందుకు సంబంధించి మహిళా, శిశు సంక్షేమశాఖతో పాఠశాల విద్యాశాఖ అధికారులు సమాలోచనలు జరుపుతున్నారు. ఇరుశాఖల అధికారులు చర్చించి అనంతరం సాధ్యాసాధ్యాలను ప్రభుత్వానికి నివేదిక రూపంలో సమర్పించనున్నారు.
ప్రభుత్వ బడుల్లో లేకపోవడంతోనే....
ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీప్రైమరీ లేకపోవడంతో ప్రైవేట్ పాఠశాలల్లో విద్యార్థులు చేరుతున్నారు. అలా ప్రీ ప్రైమరీలో చేరిన తర్వాత ఎల్‌కేజీ, యూకేజీ, ఆ తర్వాత 1వ తరగతిలో కొనసాగుతున్నారు. దీంతో 1వ తరగతిలో చేరే వారిలో ఎక్కువమంది ప్రైవేట్ పాఠశాలల్లో ఉంటుండగా ప్రభుత్వ పాఠశాలల్లో ఆ సంఖ్య ప్రథమస్థానంలో ఉంటుంది. దీన్ని నివారించేందుకు ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ప్రీప్రైమరీ క్లాసులను ప్రారంభిస్తే ప్రభుత్వ పాఠశాలల్లో కూడా చేరే విద్యార్థుల సంఖ్య పెరుగుతుందని పాఠశాల విద్యాశాఖ భావిస్తోంది.
Inter Practical Exams 2025 : ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు ప్రారంభం.. హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ ఇలా..
అంగన్‌వాడీల్లోని పిల్లల వివరాలను తీసుకుని మహిళా, శిశు సంక్షేమ శాఖతో సమన్వయం చేసుకునేలా ప్రాథమిక పాఠశాలల్లో ప్రీప్రైమరీని ప్రారంభించేలా విద్యాశాఖ కసరత్తు చేస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో 1వ తరగతిలో లక్షలోపు విద్యార్థులు ఉంటుండగా ప్రైవేట్ పాఠశాలల్లో ఆ సంఖ్య 4లక్షల వరకు ఉంటుండడాన్ని విద్యాశాఖ పరిశీలించింది.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
Tags
- pre primary classes
- students education
- kids education
- government schools
- pre primary schools
- Education Department
- primary education
- private school students
- Women And Child Welfare Department
- Anganwadi students
- first class students
- pre primary education for kids
- government schools to start pre primary
- pre primary classes for kids in govt schools
- Education News
- Sakshi Education News