New Medical College: నేడు ఎనిమిది మెడికల్ కళాశాలలు ఏర్పాటు ... నేటి నుంచి తరగతులు
మెదక్: ఈ ప్రాంత ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూసిన కల నెరవేరే సమయం ఆసన్నమైంది. గురువారం వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ మెడికల్ కళాశాలను ప్రారంభించనున్నారు. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
రెండోసారికి గ్రీన్ సిగ్నల్
రాష్ట్రవ్యాప్తంగా ఎనిమిది మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం రెండు నెలల క్రితం గ్రీన్‌సిగ్నల్ ఇవ్వగా, మెదక్‌లో పాత కలెక్టరేట్ భవనంలో మెడికల్ కళాశాలను ఏర్పాటు చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. కానీ సొంత భవనం, సిబ్బంది లేరనే సాకుతో నేషనల్ మెడికల్ కౌన్సిల్ అనుమ తులు నిరాకరించింది. దీంతో అధికారులు సరిపడా సిబ్బందిని రప్పించి వసతులు ఏర్పాటుచేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు చూపించి మళ్లీ అనుమతులు కోరా రు. రెండోసారికి నేషనల్ మెడికల్ కౌన్సిల్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.
ఇదీ చదవండి: డిగ్రీ అర్హతతో ఈనెల 26న జాబ్‌మేళా
నేటి నుంచి తరగతులు
50 సీట్లతో మెడికల్ కళాశాల ప్రారంభం కాగానే విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో ఇంటరాక్షన్ కార్యక్రమం ఉంటుందని, అనంతరం తరగతులు ప్రారంభం కానున్నట్లు సంబంధింత అధికారి తెలిపారు. ఫస్టియర్‌లో మూడు ప్రధాన తరగతులు ఉండగా, ఒక్కో డిపార్ట్‌మె ంట్‌కు (సబ్జెక్టుకు) 8 నుంచి 9 మంది సిబ్బంది ఉంటారు. ఇందులో 14 మంది ప్రొఫెసర్లు, 18 మంది అసోసియేట్ ప్రొఫెసర్లు ఉండగా, 40 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉండాల్సి ఉంది. అయితే ఇప్పటివరకు 10 మంది మాత్రమే వచ్చారు. త్వరలో మరో 30 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు రానున్నారు. మెడిసిన్ పూర్తి చేసేందుకు నాలుగున్నర ఏళ్ల సమయం పడుతుంది. మరో ఏడాదిన్నర హౌస్‌సర్జన్‌గా శిక్షణ పొందాల్సి ఉంటుంది.