Govt Medical UG College : ప్రభుత్వ వైద్య కళాశాలలో పెరిగిన యూజీ సీట్లు..
Sakshi Education
అనంతపురం: అనంతపురం ప్రభుత్వ వైద్య కళాశాలలో యూజీ సీట్ల సంఖ్య పెరిగింది. కొత్తగా 50 సీట్లు మంజూరయ్యాయి. దీంతో మొత్తం సీట్ల సంఖ్య 200కు చేరింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ సీట్లు భర్తీ చేయనున్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అనంతపురం బోధనాస్పత్రిని బలోపేతం చేశారు.
విప్లవాత్మక సంస్కరణలు ప్రవేశపెట్టారు. ఈ క్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మాణిక్య రావు పలు మార్లు ఢిల్లీకి వెళ్లి ఇక్కడి సదుపాయాలను ఎన్ఎంసీ (నేషనల్ మెడికల్ కమిషన్)కు వివరించారు. రోగులకందుతున్న మెరుగైన సేవలను తెలియజేశారు. ఈ క్రమంలో సీట్లు పెంచడంపై కళాశాల వర్గాలు హర్షం వ్యక్తం చేశాయి.
Published date : 18 Sep 2024 03:53PM