Skip to main content

Indian Air Force Admissions: ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌లో ప్రవేశాలకు దరఖాస్తులు

Indian Air Force Admissions
Indian Air Force Admissions

సూర్యాపేటటౌన్‌ : ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌లో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు జిల్లా యువజన, క్రీడల అధికారి కె.జగదీశ్వర్‌రెడ్డి, ఎయిర్‌ ఫోర్స్‌ ఆఫీసర్‌ ఎన్‌.సందీప్‌ తెలిపారు. బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఎస్వీ డిగ్రీ కళాశాల, స్పందన డిగ్రీ కళాశాలలో అగ్నివీర్‌పై విద్యార్థులకు నిర్వహించిన అవగాహన సదస్సులో వారు మాట్లాడారు.

Anganwadi 9000 jobs news: గుడ్‌న్యూస్‌ అంగన్‌వాడీలో 9వేల ఉద్యోగాలు..

ఈ నెల 28 లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అక్టోబర్‌ 18న ఆన్‌లైన్‌లో పరీక్ష ఉంటుందన్నారు. 17 సంవత్సరాల ఆరు నెలల నుంచి 21 ఏళ్ల వరకు వయసు ఉన్నవారు అర్హులన్నారు. ఇంటర్మీడియట్‌ సైన్స్‌ గ్రూప్‌ 50శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఇంగ్లిష్‌లో కనీసం 50శాతం మార్కులు వచ్చినవారు అర్హులని పేర్కొన్నారు.

Published date : 25 Jul 2024 06:32PM

Photo Stories