Skip to main content

Job Mela: రేపు జాబ్ మేళా.. అర్హులు వీరే..

నిరుద్యోగులకు శుభ‌వార్త‌.. రేపు జాబ్ మేళా.
jobs

మొగ‌ల్రాజ‌పురం(విజ‌య‌వాడ‌తూర్పు): ఉమ్మ‌డి క‌`ష్ణాజిల్లాలోని నిరుద్యోగ యువ‌త‌కు ప్రైవేటు కంపెనీల్లో ఉద్యోగాల క‌ల్ప‌న‌కు ఈ నెల 14వ తుదీర‌ర జాబ్‌మేళా నిర్వ‌హిస్తున్నామ‌ని జిల్లా ఉపాధి క‌ల్ప‌నాధికారి దేవ‌ర‌ప‌ల్లి విక్ట‌ర్‌బాబు జూన్ 12వ తేదీ ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. విజ‌య‌వాడ ర‌మేష్ ఆస్ప‌త్రి రోడ్డులోని జిల్లా ఉపాధి కార్యాల‌యం ఆవ‌ర‌ణ‌లో ఈ జాబ్ మేళా జ‌రుగుతుంద‌ని పేర్కొన్నారు. 

లైఫ్ స్టైల్‌, జ్యోతి ఫెసిలిటీ మేనేజ్‌మెంట్‌, యాక్సిస్ బ్యాంక్‌, వ‌రుణ్ మోటార్స్‌, విజేత స్టోర్స్‌, స్పంద‌న స్ఫూర్తి ఫైనాన్స్ లిమిటెడ్‌, శ్రీసాయి ఎంట‌ర్‌ప్రెజ‌స్‌, మాత్రే హెచ్ఆర్ ప్రైవేట్ లిమిటెడ్‌, జ‌య‌ల‌క్ష్మి సీ ఫుడ్స్‌, జే న్యూస్ సెక్యూరిటీస్ మొద‌లైన సంస్థ‌ల్లో ఉద్యోగాలు క‌ల్పిస్తామ‌ని వివరించారు. 

Good news for Anganwadis: అంగన్‌వాడీల్లో భారీగా ఉద్యోగాలు

ప‌దో త‌ర‌గ‌తి, ఇంట‌ర్‌, ఏదైనా డిగ్రీ, ఐటీఐ పూర్తి చేసి 18 నుంచి 30 సంవ‌త్స‌రాల‌లోపు వ‌య‌సు ఉన్న‌ వారు దీనికి అర్హుల‌న్నారు. అర్హులైన వారు త‌మ బ‌యోడేటాతో పాటుగా విద్యార్హ‌త ప‌త్రాలు, ఆధార్ కార్డుతో ఆ రోజు ఉద‌యం ప‌ది గంట‌ల నుంచి జ‌రితే జాబ్‌మేళాకు హాజ‌రు కావాల‌ని సూచించారు. మ‌రిన్ని వివ‌రాల‌కు 81424 16211 సెల్ నంబ‌రును సంప్ర‌దించాల‌ని కోరారు. 

Published date : 15 Jun 2024 12:23PM

Photo Stories