Skip to main content

Government Employees: బ్రేకింగ్ న్యూస్‌.. 70,000 మంది ప్రభుత్వ ఉద్యోగుల తొలగింపు

ప్రైవేట్ సంస్థలలో ఉద్యోగుల తొలగింపుల గురించి వింటున్న మనకు, ఇప్పుడు ప్రభుత్వాలు కూడా అదే బాటలో పయనిస్తున్నాయన్న వార్త ఆందోళన కలిగిస్తోంది.
Government Layoffs Announcement   Argentina President Javier Mili  decision  Argentine President Javier Milei to fire 70,000 government employees    Economic Impact of Government Layoffs

అయితే ప్రభుత్వాలు సైతం వేల సంఖ్యలో ఉద్యోగులను తొలగించడం సంచలంగా మారింది. అర్జెంటీనా అధ్యక్షుడు జేవియర్ మిలీ రాబోయే నెలల్లో 70,000 మంది ప్రభుత్వ ఉద్యోగులను తొలగించాలని సంచలన నిర్ణయం తీసుకున్నారు.

బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం..
➢ ప్రభుత్వంపై ఆర్థిక భారాన్ని తగ్గించడానికి ఈ చర్యలు తీసుకుంటున్నట్లు అధ్యక్షుడు మిలీ తెలిపారు.
➢ 35 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులతో పోలిస్తే 70,000 మంది తొలగింపు చాలా తక్కువ అని భావించినప్పటికీ, కార్మిక సంఘాల నుండి తీవ్రమైన ప్రతిఘటన ఎదురయ్యే అవకాశం ఉంది.

Argentine President Javier Milei

కాంట్రాక్ట్ ఉద్యోగుల భవిష్యత్తు అయోమయం
➢ మార్చి 31తో ముగియనున్న వేలాది మంది కాంట్రాక్ట్ ఉద్యోగుల ఒప్పందం గురించి స్పష్టత లేదు.
➢ గత ఏడాదే ముగిసిన ఒప్పందాన్ని మూడు నెలలు పొడిగించినప్పటికీ, ఈసారి పొడిగింపు ఉండదని భావిస్తున్నారు.
➢ యూనియన్ నాయకులు అన్యాయమైన తొలగింపులను సహించబోమని హెచ్చరించారు.
➢ రాబోయే రోజుల్లో కార్యాచరణ ప్రకటిస్తామని స్పష్టం చేశారు.

Job Layoffs: 10 నిమిషాల వీడియో కాల్‌.. ఊడిన 400 మంది ఉద్యోగాలు!!

Published date : 27 Mar 2024 05:00PM

Photo Stories