Contract to Permanent: కాంట్రాక్ట్ ఉద్యోగులకు పర్మనెంట్ ఉత్తర్వులు జారీ..!
Sakshi Education
ఆదివారం జరిగిన కార్యక్రమంలో వైద్య ఆరోగ్యశాఖలో కాంట్రాక్ట్ ఉద్యోగాల్లో ఉన్న పలువురిని పర్మినెంట్ ఉద్యోగులుగా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఉద్యోగుల వివరాలను తెలిపారు డీఎంహెచ్‌ఓ..
మహారాణిపేట: వైద్య ఆరోగ్యశాఖలో కాంట్రాక్ట్ ఉద్యోగులకు పర్మినెంట్ ఉత్తర్వుల జారీ ప్రక్రియ ఆదివారం కూడా కొనసాగింది. డీఎంహెచ్‌వో కార్యాలయంలో ఐదు బృందాలు రెగ్యులర్ అవుతున్న కాంట్రాక్ట్ ఉద్యోగుల సర్టిఫికెట్లను పరిశీలించాయి. అనంతరం డీఎంహెచ్‌వో పి.జగదీశ్వరరావు వారికి పర్మినెంట్ ఉత్తర్వులు అందజేశారు. రెండు రోజుల్లో 82 మందిని పర్మినెంట్ చేస్తూ నియామక ఉత్తర్వులు అందజేసినట్టు డీఎంహెచ్‌వో వివరించారు.
72 ఎంపీహెచ్‌ఎ(మేల్)లో 57 మందికి, ఆరుగురు ల్యాబ్ టెక్నీషియన్‌ల్లో ఐదుగురికి, ఏడుగురు ఫార్మసిస్టులు(గ్రేడ్–2) ఏడుగురికి, 13 మంది ఎంపీహెచ్‌ఏ(ఫీమెల్)లో 13 మందికి ఉత్తర్వులు అందజేసినట్లు ఆయన వెల్లడించారు. రెండు రోజుల్లో ఈ ప్రక్రియను పూర్తి చేస్తామన్నారు.
Published date : 11 Mar 2024 03:58PM