US Report: యూఎస్ మానవహక్కుల నివేదిక.. తీవ్రంగా ఖండించిన భారత్
యూఎస్ డాక్యుమెంట్ తీవ్ర పక్షపాతంతో కూడుకొని ఉందని, భారత్‌పై సరైన అవగాహన లేకపోవాడాన్ని ప్రతిబింబిస్తోందని పేర్కొంది. గతేడాది మణిపూర్‌లో హింస చెలరేగిన తర్వాత రాష్ట్రంలో గణనీయమైన మానవ హక్కుల ఉల్లంఘనలు జరిగాయని యూఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్ ఇటీవల ఓ నివేదిక పేర్కొంది.
దీనిపై విదేశాంగ మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ స్పందించారు. ఈ నివేదిక తీవ్ర పక్షపాతంలో కూడుకున్నట్లు తెలిపారు. భారత్‌పై అమెరికాకు సరైన అవగాహన లేదనే విషయం స్పష్టంగా కనిపిస్తోందన్నారు. దీనికి తాము(భారత్) ఎలాంటి విలువ ఇవ్వడం లేదని తెలిపారు.
Child Born: ఈ దేశంలో ఒక్క బిడ్డను కంటే రూ.61 లక్షలు!
కాగా ‘2023 కంట్రీ రిపోర్ట్స్ ఆన్ హ్యూమన్ రైట్స్ ప్రాక్టిసెస్: ఇండియా’ పేరుతో విడుదల చేసిన ఈ డాక్యుమెంట్‌లో మణిపూర్‌లో మైతీ, కుకీ వర్గాల మధ్య చెలరేగిన జాతి వివాదం మానవ హక్కులు ఉల్లంఘనకు దారి తీసినట్లు ఆరోపించిందని నివేదిక పేర్కొంది.