Skip to main content

From Eye Doctor to Dictator: కంటి వైద్యుడి నుంచి కర్కశ నియంత దాకా ఎదిగిన అసద్‌..!

సిరియాకు చెందిన అధ్యక్షుడు బాషార్ అల్-అసద్.. అతని పాలన అంతర్యుద్ధం, హక్కుల ఉల్లంఘన, నిరంకుశతత్వం ద్వారా ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతి పొందారు.
From Eye Doctor to Dictator, The Rise and Fall of Assad Presidency

అసద్ పీఠంపై బలమైన పద్ధతిలో అడుగుపెట్టినట్టు చెప్పుకోవచ్చు. డమాస్కస్‌ మెడికల్‌ కాలేజీలో చదివిన అసద్‌ తర్వాత ఆప్తమాలజీ చదివేందుకు బ్రిటన్‌ వెళ్లి అక్కడే స్థిరపడ్డాడు. అసద్‌ తొలినాళ్లలో లండన్‌లో నేత్ర వైద్యునిగా సేవలందించేవారు.

1971 సంవత్సరం నుంచి సిరియాను తన ఉక్కుపిడికిలి కింద పాలిస్తున్న తన తండ్రి హఫీజ్‌ మరణంతో 2000 సంవత్సరంలో అసద్‌(34 ఏళ్ల వయస్సులో) స్వదేశానికి తిరిగొచ్చి అధ్యక్ష పదవికి చేరుకున్నారు. అయితే వయస్సు 40 ఏళ్లు కావడంతో, పార్లమెంట్ చట్ట సవరణచేసి అతనికి పదవి అందించింది.

అసద్ ప్రభుత్వంపై 2011 వరకు పెద్దగా విమర్శలు లేవు, కానీ అరబ్ విప్లవం తర్వాత ప్రజల నిరసనలు పెరిగాయి. డమాస్కస్, డేరా నగరాల్లో ప్రజలు విప్లవం కోసం వీధుల్లోకి వచ్చారు, అప్పుడు అసద్ ప్రభుత్వం ఉక్కుపాదంతో ఆందోళనలను అణిచివేసింది. ఈ సంఘటన తర్వాత అసద్ తన పాలనను మరింత నియంత్రణలో ఉంచేందుకు మార్గాలు అన్వేషించుకుంటూ నిరంకుశ పాలన మొదలుపెట్టాడు.

Marie Curie: రెండుసార్లు నోబెల్‌ బహుమతి పొందిన ఏకైక మహిళ.. ఆమె ఎవరంటే..

అసద్ పాలనలో మానవహక్కుల ఉల్లంఘనలు, అక్రమ అరెస్టులు, రసాయన ఆయుధాల ప్రయోగం, కుర్దులను అణగదొక్కడం, ప్రభుత్వ ఆధ్వర్యంలో హత్యలు, కిడ్నాప్‌లు వంటివి సాధారణంగా చోటుచేసుకోవడం మొదలయ్యాయి. 2011 తర్వాత, అలెప్పో సిటీలో విప్లవకారులతో ఘర్షణలు, ఆలెప్పో నగరం తిరిగి ప్రభుత్వ ఆధీనంలోకి రాగానే, ఇడ్లిబ్ ప్రాంతం తిరుగుబాటుదారులు స్వాధీనం చేసుకున్నారు, కానీ 2019 లో ఐసిస్‌ ఉగ్రసంస్థ రాజ్యం నుండి నశించిపోయింది.

Marco Rubio : విదేశాంగ మంత్రిగా ఎంపికైన‌ ఫ్లోరిడా సెనేటర్‌ మార్కో రూబియో

అసద్ పాలన 2015లో రష్యా మద్దతుతో మరింత బలపడింది. 2017లో, అమెరికా సేనలు అసద్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పరోక్షంగా రంగ ప్రవేశం చేశాయి. 14 ఏళ్ల అంతర్యుద్ధం తర్వాత, ఇడ్లిబ్ ఆక్రమణతో తిరుగుబాటుదారుల విజయం, డమాస్కస్ మీద దాడి, 59 సంవత్సరాల అసద్ పాలనకు ఎట్టకేలకు ముగింపు తెచ్చింది.

ఈ దశలో అసద్ పాలనలో సిరియాలో 5 లక్షల మందికి పైగా ప్రాణాలు కోల్పోయాయి. సిరియాలోని 11 లక్షల మంది ప్రజలు శరణార్థులుగా విదేశాలకు వెళ్ళిపోయారు. అసద్‌కు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు.

Published date : 10 Dec 2024 09:57AM

Photo Stories