Earthquake in Tibet: టిబెట్‌లో భారీ భూకంపం.. 53 మంది మృతి!
రిక్టర్ స్కేల్‌పై ఈ భూకంపం తీవ్రత 7.1గా నమోదైంది. ఈ రోజు పలు దేశాల్లో భూకంపం సంభవించింది. ఇందులో భారతదేశం, నేపాల్, టిబెట్, కోల్‌కతా, బిహార్, ఢిల్లీ పరిసర ప్రాంతాలు తీవ్ర పరిణామాలను అనుభవించాయి.
టిబెట్ ప్రాంతంలోని పర్వతాల్లో దాదాపు 10 కిలోమీటర్ల లోతులో సంభవించిన ఈ భూకంపంలో 53 మంది మృతి చెందగా, మొత్తం 62 మంది ప్రాణాలు కోల్పోయారు.
అమెరికా యూనైటెడ్ జియోలాజికల్ సర్వే (USGS) ప్రకారం.. భారత కాలమానం ప్రకారం జనవరి 7వ తేదీ ఉదయం 6:35 గంటలకు నేపాల్‌లోని లుబోచి నుంచి 93 కిలోమీటర్ల దూరంలో భూమి కంపించింది. ఈ భూకంపం ప్రభావం, డెలీ, బీహార్, కోల్‌కతా, నేపాల్‌లోని ఇతర ప్రాంతాల్లో కూడా అనుభవించారు. భూమి తీవ్రంగా కంపించిన కారణంగా ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.
Air Pollution: వాయుకాలుష్యంతో.. రక్తం గడ్డకట్టే ముప్పు
భూకంపం ప్రభావంతో సహాయక చర్యలు ప్రారంభించబడినాయి. భారతదేశం, నేపాల్, ఇతర ప్రదేశాల్లో అత్యవసర సిబ్బంది రంగంలోకి దిగింది. అధికారులు పరిస్థిని నిశితంగా పర్యవేక్షిస్తున్నారు.
2015లో తొమ్మిదివేల మంది దుర్మరణం
ప్రపంచంలో భూకంపాలు ఎక్కువగా సంభవించే ప్రాంతాల్లో నేపాల్ ఒకటి. ఇక్కడ తరుచూ భూకంపాలు సంభవిస్తుంటాయి. చివరి సారిగా ఏప్రిల్ 25, 2015న నేపాల్‌లో 7.8 తీవ్రతతో వచ్చిన భారీ భూకంపం సుమారు 9వేలమందిని పొట్టన పెట్టుకుంది. 10 లక్షల ఇళ్లు ధ్వంసమయ్యాయి. దీన్ని బట్టి ఇవాళ సంభవించిన భూకంప తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఖాట్మండ్ జనాభాలో మూడోవంతు
నేపాల్‌లో తొలిసారిగా అభయ మల్ల రాజు పాలనలో 7 జూన్ 1255లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 7.8 తీవ్రత నమోదైంది. నాడు సంభవించిన భూకంపం కారణంగా నేపాల్ రాజధాని ఖాట్మండ్ జనాభాలో మూడోవంతు మంది ప్రాణాలు కోల్పోయారు. వారిలో నేపాల్ రాజు అభయ మల్ల రాజు సైతం ఉన్నారు.
Pakistan: ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో తాత్కాలిక సభ్యదేశంగా పాకిస్తాన్