Skip to main content

HMPV Virus In India: భారత్‌లో న‌మోదైన‌ మూడు హెచ్‌ఎంపీవీ వైరస్‌ కేసులు.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే..

చైనా (China)లో కలకలం సృష్టిస్తున్న హ్యూమన్ మెటాప్ న్యూమో వైరస్ (HMPV) కేసులు భారత్‌లో నమోదయ్యాయి.
HMPV Virus To India

బెంగళూరుకు చెందిన బాపిస్ట్‌ ఆస్పత్రిలో మూడు, ఎనిమిది నెలల చిన్నారుల్లో ఈ వైరస్‌ను గుర్తించినట్లు ఐసీఎంఆర్‌ (icmr) దృవీకరించింది. వీరిలో ఒక చిన్నారికి వైరస్‌ తగ్గుముఖం పట్టిందని, మరొకరికి చికిత్స అందిస్తున్నట్లు తెలిపింది. అయితే, చిన్నారుల కుటుంబ సభ్యులు విదేశాలకు వెళ్లిన చరిత్ర లేదని కర్ణాటక ఆరోగ్యశాఖ వెల్లడించింది.  అహ్మదాబాద్‌లో మరో కేసు నమోదైనట్లు సమాచారం. 

అప్రమత్తమైన కేంద్రం 
చైనాలో పెరిగిన హెచ్‌ఎంపీవీ కేసులతో పాటు ఇతర శ్వాసకోశ వైరస్‌లను పర్యవేక్షిస్తున్నట్లు కేంద్రం జ‌న‌వ‌రి 5వ తేదీ ప్రకటించింది. ఇప్పటికే ఆ వైరస్‌ వ్యాప్తితో దేశంలో తలెత్తే పరిస్థితులపై అంచనా వేసేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ,నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, ఇతర ఆరోగ్య సంస్థల ప్రతి నిధులు జనవరి 4న జరిగిన జాయింట్ మానిటరింగ్ గ్రూప్‌ సమావేశంలో పాల్గొన్నారు.  

వైరస్‌ టెస్ట్‌ల కోసం
ముందు జాగ్రత్తగా, కేంద్రం హెచ్‌ఎంపీవీ టెస్ట్‌ల కోసం ప్రయోగశాల సామర్థ్యాన్ని పెంచింది. ఐసీఎంఆర్‌  ఏడాది పొడవునా హెచ్‌ఎంపీవీ ధోరణులను పర్యవేక్షిస్తుంది. ఇన్ఫ్లుఎంజా, అక్యూట్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్లతో పాటు ఇతర శ్వాసకోశ వ్యాధులను గుర్తించేలా ఐసీఎంఆర్‌, ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్వైలెన్స్ ప్రోగ్రామ్ ద్వారా దేశవ్యాప్తంగా శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్‌లను ట్రాక్ చేసేలా సంబంధిత శాఖలకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.

New Virus: చైనాలో మరో కొత్త వైరస్ కలకలం!

వైరస్‌ వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
చైనాలో గుర్తించిన హ్యూమన్‌ మెటా న్యూమో వైరస్‌ (హెచ్‌ఎంపీవీ) వైరస్‌ వ్యాప్తి  భారత్‌లో ఆందోళన కలిగిస్తోంది. అయితే ఈ వైరస్‌ వ్యాప్తిపై ఆందోళన చెందవద్దని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.  

చిన్నపిల్లలు, వృద్ధులతో పాటు వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారిపై వైరస్‌ ప్రభావం ఎక్కువగా ఉంటుందని వివరించారు. వైరస్‌ సోకిన వ్యక్తుల నోటి నుంచి వెలువడే తుంపర్లు, ఇతరులతో సన్నిహితంగా మెలగటం, కరచాలనం, స్పర్శ వంటి చర్యల ద్వారా ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుందని పేర్కొంది. ఇక వైరస్‌ సోకిన 3–10 రోజుల్లోపు వ్యాధి లక్షణాలు బయటపడతాయని తెలిపారు. 

ఇప్పటివరకు.. ఈ వ్యాధి సోకిన వారికి నిర్దిష్టమైన యాంటీ వైరల్‌ చికిత్సలేదని.. వ్యాక్సిన్లు కూడా అభివృద్ధి చేయలేదని, ఆరోగ్య సంరక్షణ కోసం నొప్పి నివారణ మందులు, ఆక్సిజన్‌ థెరపీ చేపడుతున్నారు. 

వైరస్‌ వ్యాప్తితో.. 
దగ్గు, ముక్కు దిబ్బడ, ముక్కు కారడం, గొంతు నొప్పి, శ్వాస సంబంధిత సమస్యలుంటాయి. కొన్నిసార్లు న్యూమోనియా, బ్రాంకైటిస్‌ (ఆస్తమా) వంటి శ్వాసకోశ సమస్యలకు దారితీస్తుంది.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే..

  • 20 సెకన్లపాటు సబ్బు నీటితో తరచూ చేతులను శుభ్రంగా చేసుకోవాలి.
  • తుమ్మినా, దగ్గినా నోరు, ముక్కుకు రుమాలును అడ్డుపెట్టుకోవాలి. 
  • రద్దీగా ఉండే ప్రదేశాలకు దూరంగా ఉండాలి. 
  • తగినంత పౌష్టికాహారం, మంచినీరు తీసుకోవడంతో పాటు, నిద్రపోవాలి.
  • వైరస్‌ లక్షణాలు కన్పించిన వెంటనే క్వారంటైన్‌లో ఉండాలి. 
  • లక్షణాలు కన్పిస్తున్న వ్యక్తులు ఇతరులతో కరచాలనం చేయరాదు.

Global Warming: 2024లో ప్రపంచవ్యాప్తంగా అధికంగా ఉన్న ఉష్ణోగ్రతలు భార‌త్‌లోనే..!

Published date : 07 Jan 2025 10:07AM

Photo Stories