International Students: అంతర్జాతీయ విద్యార్థులకు రెండు ప్రత్యేక వీసాలు
Sakshi Education
ఉన్నత విద్య కోసం భారత్‌కు వచ్చే విదేశీ విద్యార్థుల కోసం రెండు ప్రత్యేక కేటగిరీ వీసాలను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది.
ఈ–స్టూడెంట్ వీసా, ఈ–స్టూడెంట్–ఎక్స్ వీసాలను కేంద్ర హోం శాఖ ప్రవేశపెట్టినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈ రెండు రకాల వీసాల కోసం విదేశీ విద్యార్థులు స్టడీ ఇన్ ఇండియా(ఎస్‌ఐఐ) పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని సూచించాయి.
ఈ–స్టూడెంట్ వీసాలను అర్హులైన విదేశీ విద్యార్థులకు మంజూరు చేస్తారు. వారిపై ఆధారపడినవారు ఈ–స్టూడెంట్–ఎక్స్ వీసా ద్వారా భారత్‌కు రావచ్చు. వీటి కోసం పోర్టల్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. లాంగ్–టర్మ్, షార్ట్–టర్మ్ కోర్సుల్లో ప్రవేశానికి ఈ పోర్టల్ ద్వారా సేవలు పొందే వెసులుబాటు ఉంది.
కేంద్ర విద్యా శాఖ ప్రాజెక్టు కింద దేశంలో 600కు పైగా విద్యా సంస్థలు విదేశీయులకు ప్రవేశాలు కల్పిస్తున్నాయి. వేర్వేరు రంగాలకు సంబంధించి 8 వేలకు పైగా కోర్సులు అందిస్తున్నాయి.
H-1B Visa: హెచ్-1బీ వీసాల్లో భారత టెక్ కంపెనీలే టాప్
Published date : 07 Jan 2025 10:04AM