H-1B Visa: హెచ్-1బీ వీసాల్లో భారత టెక్ కంపెనీలే టాప్
యూఎస్ సిటీజన్‌షిప్, ఇమిగ్రేషన్ సర్వీసెస్ గణాంకాల ప్రకారం 2024లో ఏప్రిల్-సెప్టెంబర్ మధ్య అమెరికా ప్రభుత్వం 1.3 లక్షల హెచ్-1బీ వీసాలు జారీ చేయగా, వాటిలో 24,766 వీసాలు భారత కంపెనీలే దక్కించుకున్నాయి.
ఇన్ఫోసిస్ సంస్థకు అత్యధికంగా 8,140, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్)కు 5.274, హెచ్‌సీఎల్‌కు 2,953 వీసాలు లభించాయి.
చెన్నైలో స్థాపించిన కాగ్నిజెంట్ సంస్థ ప్రధాన కార్యాలయం ప్రస్తుతం అమెరికాలోని న్యూజెర్సీలో ఉంది. ఈ సంస్థకు 6,321 వీసాలు లభించాయి. పలు దేశాల్లో కార్యకలాపాలు కొనసాగిస్తున్న అమెజాన్.కామ్ సర్వీసెస్‌కు 9.265 వీసాలు జారీ అయ్యాయి. ఇండియాలో స్థాపించిన విప్రో సంస్థకు 1.634, టెక్ మహింద్రాకు 1.199 హెచ్-1బీ వీసాలు దక్కాయి. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ తరహా వీసాలపై పరిమితులు విధించవచ్చని వార్తలు వస్తున్నాయి.
American Visa : అమెరికాలో గణనీయంగా పెరిగిన భారతీయుల సంఖ్య.. ఈసారి 10 లక్షల వీసాల్లో..