Sabalenka: డబ్ల్యూటీఏ బ్రిస్బేన్ ఓపెన్–500 టోర్నీ విజేత సీడ్ సబలెంకా
హోరాహోరీగా సాగిన సింగిల్స్ ఫైనల్లో సబలెంకా 4–6, 6–3, 6 2తో ప్రపంచ 107వ ర్యాంకర్, క్వాలిఫయర్ పొలీనా కుదెర్‌మెతోవా (రష్యా)పై గెలిచింది. ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్‌తో బెలారస్ టెన్నిస్ స్టార్ సబలెంకా గత ఏడాదిని ముగించింది.
ప్రైజ్‌మనీ..
విజేతగా నిలిచిన సబలెంకాకు 1,92,475 డాలర్ల (రూ.1 కోటీ 65 లక్షలు) ప్రైజ్‌మనీతోపాటు 500 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. కుదెర్‌మెతోవాతో జరిగిన తుది పోరులో సబలెంకా తొలి సెట్‌ను కోల్పోయినా... నెమ్మదిగా తేరుకొని ఆ తర్వాత వరుసగా రెండు సెట్‌లను సొంతం చేసుకుంది. 1 గంట 47 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సబలెంకా ఐదు ఏస్‌లు సంధించింది.
తన సర్వీస్‌ను మూడుసార్లు కోల్పోయి.. ప్రత్యర్థి సర్వీస్‌ను ఆరుసార్లు బ్రేక్ చేసింది. కుదెర్‌మెతోవా ఆరు ఏస్‌లు సంధించినా.. తొమ్మిది డబుల్ ఫాల్ట్‌లు చేసి మూల్యం చెల్లించుకుంది. టోర్నీ మొత్తంలో కేవలం ఒక సెట్‌ను కోల్పోయిన సబలెంకా తాజా విజయంతో కెరీర్‌లో 18వ సింగిల్స్ టైటిల్‌ను దక్కించుకుంది. సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ ఆ్రస్టేలియన్ ఓపెన్‌లో సబలెంకా డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగనుంది.
Sports Awards: తెలుగు తేజాలు దీప్తి, జ్యోతిలకు ‘అర్జున’ అవార్డు